Asianet News TeluguAsianet News Telugu

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

టీంఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ ఆరంభంలో పాకిస్థాన్ జట్టుపై సాధించిన సెంచరీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకుంటారు. 2006లో ఫైసలాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ ధోని సెంచరీ సాధించాడు. ఇలా పాకిస్థాన్ ధోనీ సాధించిన 148 పరుగులే ఇప్పటివరకు విదేశాల్లో భారతీయ వికెట కీఫర్లు సాధించిన అత్యధిక పరుగులు. అయితే తాజాగా సిడ్నీ టెస్టులో  ఆ రికార్డును యువ వికెట్ కీఫర్ రిషబ్ పంత్ బద్దలుగొట్టాడు.

rishab pant breaks dhoni record
Author
Sydney NSW, First Published Jan 4, 2019, 3:12 PM IST

టీంఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ ఆరంభంలో పాకిస్థాన్ జట్టుపై సాధించిన సెంచరీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకుంటారు. 2006లో ఫైసలాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ ధోని సెంచరీ సాధించాడు. ఇలా పాకిస్థాన్ ధోనీ సాధించిన 148 పరుగులే ఇప్పటివరకు విదేశాల్లో భారతీయ వికెట కీఫర్లు సాధించిన అత్యధిక పరుగులు. అయితే తాజాగా సిడ్నీ టెస్టులో  ఆ రికార్డును యువ వికెట్ కీఫర్ రిషబ్ పంత్ బద్దలుగొట్టాడు.

సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ చెలరేగి ఆడుతూ ఆసిస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. తనదైన బ్యాటింగ్ ప్రదర్శనతో చెలరేగి ఆడుతూ పంత్ సెంచరీ సాధించాడు. ఇలా తన కెరీర్ లో రెండో సెంచరీ సాధించిన పంత్ పలు రికార్డులను కూడా బద్దలుగొట్టాడు. ముఖ్యంగా లెజెండరీ క్రికెటర్ మహేద్ర సింగ్ ధోని పేరిట వున్న అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 

విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన వికెట్ కీఫర్ గా ఇప్పటివరకు ధోని నిలవగా...తాజా ఇన్నింగ్స్‌తో ఆ స్థానాన్ని పంత్ కైవసం చేసుకున్నాడు.  గతంలో పాకిస్థాన్ జట్టుపై వారి దేశంలోనే ధోనీ 148 పరుగులు సాధించి రికార్డు నెలకొల్పాడు. సిడ్నిలో రిషబ్ పంత్ 159 పరుగులు 189 బంతులతో నాటౌట్ గా నిలిచి 12 ఏళ్లుగా ధోని పేరిట వున్న ఈ రికార్డును బద్దలుగొట్టాడు.   

ఇదే సిడ్ని టెస్టు సెంచరీ ద్వారా పంత్ మరో అరుదైన రికార్డును కూడా నెలకొల్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటి వరకు ఏ భారత వికెట్ కీపర్ కూడా టెస్టుల్లో సెంచరీ సాధించలేదు. కానీ రిషబ్ పంత్ ఈ ఘనతను సాధించిన  ఏకైక ఇండియన్ వికెట్ కీఫర్ గా నలిచాడు.   

మరిన్ని వార్తలు

రికార్డ్ బ్రేక్: ధోనీ వల్ల కానిది పంత్ సాధించాడు

సిడ్నీ టెస్ట్: 622 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్

సిడ్నీ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 303/4

మయాంక్ రికార్డుల మోత

సచిన్ ముందు, వెనుక స్థానాలు పుజారావే...

పింక్ గ్లౌవ్స్, బ్యాట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ ...విశేషమేంటబ్బా?

నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లోకి దిగిన ఆసీస్, భారత్ క్రికెటర్లు...ఎందుకంటే

పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు

Follow Us:
Download App:
  • android
  • ios