టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ నిజాయితికి క్రికెట్ అభిమానులతోపాటు.. అంపైర్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మొన్నటి వరకు తన పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన  రాహుల్.. ఇప్పుడు ప్రశంసలను అందుకుంటున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... నాలుగో టెస్టు మూడో రోజు 15వ  ఓవర్ బౌలింగ్ రవీంద్ర జడేజా చేశాడు. ఆ ఓవర్ లో మొదటి బాల్ ని ఆడిన ఆసీస్ ఓపెనర్ హారిస్.. కొట్టిన షాట్ ని రాహుల్ క్యాచ్ పట్టాడు. అందరూ హారిస్ ఔటయ్యాడని భావించారు. కానీ.. క్యాచ్ కి ముందు బంతి నేలను తాకిన విషయాన్ని గ్రహించిన రాహుల్.. అది క్యాచ్ కాదంటూ చేతులు ఊపుతూ సిగ్నల్ ఇచ్చి తన నిజాయితీని చాటుకున్నాడు.

ఆ సమయంలో అక్కడే ఉన్న బుమ్రా.. రాహుల్ వద్దకు వచ్చి తలపై తడుతూ మెచ్చుకున్నాడు. అక్కడే ఉన్న అంఫైర్ ఇయాన్ గౌలడ్్ కూడా రాహుల్ నిజాయితీకి మెచ్చి..‘శభాష్ రాహుల్... ఇది క్రీడా స్ఫూర్తి. కీప్ ఇట్ అప్’ అంటూ కొనియాడారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.  చీటింగ్ చేసి గెలవాలి అనుకునే వారంతా రాహుల్ ని చూసి నేర్చుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.