టీం ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ తో హీరోయిన్ సోనాల్ చౌహాన్ డేటింగ్ లో ఉందా...? అవుననే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. వాళ్లిద్దరూ ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా...దీనిపై తాజాగా సోనాల్ స్పందించింది.

పబ్లిసిటీ కావాలనుకునే వాళ్లకి ఇలంటి వదంతులతో అవసరం ఉంటుందని.. తనకు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.‘కేఎల్‌ రాహుల్‌ మంచి క్రికెటర్‌. ఎంతో టాలెంట్‌ ఉన్న వ్యక్తి. గొప్పవాడు. నేను అతనితో డేటింగ్‌లో లేను. ఈ విషయంలో ఇంకేమయిన స్పష్టత కావాలంటే ఈ వార్తలు ఎవరు పుట్టించారో వాళ్లనే అడగండి’ అని సోనాల్‌ అన్నారు. 

కాగా... సోనాల్ కన్నా ముందు... మజ్ను బ్యూటీ నిధి అగర్వాల్ కూడా కేఎల్ రాహుల్ తో డేటింగ్ చేస్తోందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వీళ్లద్దరూ కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోలు కూడా నెట్టింట దర్శనమిచ్చాయి. అయితే... తమ మధ్య అలాంటిదేమీ లేదని రాహుల్, నిధిలు క్లారిటీ ఇచ్చారు.  నిధి అగర్వాల్ కన్నా ముందు కూడా  ఆకాంక్ష రంజన్ కపూర్ అనే మోడల్ తో కూడా డేటింగ్ చేశాడనే ప్రచారం జరిగింది.

నిధి అగర్వాల్, సోనాల్ చౌహాన్ లు టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇక కేఎల్ రాహుల్ ప్రస్తుతానికి వరల్డ్ కప్ మెగా టోర్నీ కోసం ఇంగ్లాండ్ వెళ్లారు.