Indian team : హార్దిక్ పాండ్యాను సెలక్ట్ చేసింది అందుకేనా.. !
T20 World Cup Indian team : భారత టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో హార్దిక్ పాండ్యా ఎంపికను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమర్థించారు. హార్దిక్ పాండ్యా సెలక్షన్ విషయంలో వస్తున్న విమర్శల క్రమంలో ఎందుకు జట్టులోకి తీసుకున్నామనేది వివరించారు.
team India Hardik Pandya : వెస్టిండీస్, అమెరికా వేదికలుగా టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ ను నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అయితే, ప్రస్తుతం పెద్దగా ఫామ్ లో కనిపించని హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇందులో విమర్శలు గుప్పించేవారే ఎక్కువ. అయితే, భారత టీ20 ప్రపంచ కప్ జట్టులో హార్దిక్ పాండ్యా ఎంపికను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సమర్థించారు, జట్టుకు సమతుల్యతను అందించడమే కోసమే ఎంపిక చేశామని చెప్పాడు. అలాగే, హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉంటే అతను ఏమి చేయగలడు అనేదానికి ప్రత్యామ్నాయం లేదని చెప్పాడు. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం పడదని కూడా చెప్పాడు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్‌లో పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న హార్దిక్ పాండ్యాను టీ20 ప్రపంచకప్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా చేయడం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హార్దిక్ పాండ్యా 2023 అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఏకైక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత భారత్ తరఫున బరిలోకి దిగలేదు. ప్రస్తుతం ఐపీఎల్ లో ప్లేయర్ గా, కెప్టెన్ గా విఫలమవుతున్నాడు. దీంతో హార్దిక్ భారత జట్టుకు ఎంపిక చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.
SRH VS RR : బ్యాటింగ్ చేయడం చాలా కష్టం... సిగ్గు లేకుండా తన డకౌట్ ను సమర్థించుకున్న సంజూ శాంసన్..
ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ, 'వైస్ కెప్టెన్సీకి సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదు. ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. నెల రోజుల తర్వాతే తొలి మ్యాచ్ ఆడాలి. అతను ఫిట్‌గా ఉంటే, అతను ఏమి చేయగలడు అనేదానికి ప్రత్యామ్నాయం లేదు. గాయం నుంచి చాలా కాలం తర్వాత తిరిగి వస్తున్నాడు. అతను దానిపై పని చేస్తున్నాడని మేము ఆశిస్తున్నాము. అతను బౌలింగ్ చేసేటప్పుడు రోహిత్‌కు చాలా ఎంపికలు, బలెన్స్ ఇవ్వగలడని తెలిపాడు. 'హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉన్నంత వరకు, అతను ఏమి చేయగలడో మాకు తెలుసు. అతను జట్టుకు ఎంత బ్యాలెన్స్ ఇస్తాడు. ముఖ్యంగా అతను బౌలింగ్ చేసే విధానం విషయానికి వస్తే, ప్రస్తుతం క్రికెటర్‌గా అతను ఏమి చేయగలడో దానికి ప్రత్యామ్నాయం లేదని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు.
అలాగే, హార్దిక్ బ్యాలెన్స్‌తో రోహిత్‌కు విభిన్న కాంబినేషన్‌లలో ఆడే అవకాశాన్ని ఇచ్చాడు, కాబట్టి అతని ఫిట్‌నెస్ ముఖ్యమనీ, ఇప్పటివరకు బాగా ఆడుతూ రాణఙస్తున్నాడని చెప్పాడు. అయితే, హార్దిక్ పాండ్యా విషయంలో క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఐపీఎల్‌కు ముందు హార్దిక్ పాండ్యా చీలమండ గాయం నుండి కోలుకున్నాడు. రోహిత్ స్థానంలో అతన్ని ముంబై కెప్టెన్‌గా చేయడంపై అభిమానులలో చాలా కోపం ఉంది. సెలక్షన్ కమిటీ, కెప్టెన్ రోహిత్ తమకు ఏం కావాలో స్పష్టంగా చెప్పారనీ, ఐపీఎల్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలు తమను పెద్దగా ఆకట్టుకోలేదని అగార్కర్ అన్నాడు.
Team India T20 World Cup: రింకూ సింగ్, కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే.. !