న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌ నుంచి రిషభ్‌ పంత్‌ను తప్పించడంపై టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ స్పష్టత ఇచ్చారు. రిషబ్ కు విశ్రాంతి మాత్రమే ఇ‍చ్చామని, జట్టు నుంచి ఉద్వాసన పలకలేదని ఆయన చెప్పారు. అతనొక ఎదుగుతున్న క్రికెట్‌ విజేత అని ప్రశంసలు కురిపించారు.

తమ ప్రపంచ కప్ ప్రణాళికల్లో రిషభ్‌ కూడా ఉన్నాడని ఎమెస్కే  స్సష్టం చేశారు. ఆస్ట్రేలియాలో రిషభ్‌ పంత్‌ నాలుగు టెస్టులు, మూడు టీ20లు ఆడాడని, విరామం లేని ఆట అతడి శరీరంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. రిషబ్ కు కనీసం రెండు వారాల విశ్రాంతి అవసరమని అన్నారు. 

ఆ తర్వాత ఇంగ్లాండ్‌ లయన్స్‌పై ఎన్ని మ్యాచ్‌లు ఆడగలడో చూస్తామని, రిషబ్ శక్తియుక్తులేమిటో అతడికింకా పూర్తిగా తెలియదృని, అవసరానికి తగినట్టు ఆడగలనని నిరూపించాడని ఎమెస్కే అన్నారు. 

టెస్టులకు ఎంపిక చేసినప్పుడు అతడి కీపింగ్‌ ప్రతిభ గురించి అందరూ పెదవి విరిచారని, ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 11 క్యాచ్‌ అందుకున్నప్పుడు, ఆస్ట్రేలియాలో రికార్డులు బద్దలు చేసినప్పుడు తమ అంచనా నిజమైందని అన్నారు.

సంబంధిత వార్తలు

ధోనీకి షాక్, పంత్ కు జోష్: ఇంగ్లాండు దిగ్గజం కామెంట్స్

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి షాక్ 

ఆసీస్ తో వన్డే సిరీస్: పాండ్యా స్థానంలో విజయ్ శంకర్

అనుచిత వ్యాఖ్యలు: హార్డిక్ పాండ్యాకు మరో దెబ్బ

హార్దిక్ పాండ్యా ఎవరు..? ఈషా గుప్త ఫైర్

వారిద్దరూ ఉంటే నా భార్యాకూతుళ్లతో... భజ్జీ సంచలన వ్యాఖ్యలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు