ముంబై: సస్పెన్షన్ కు గురైన క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ లపై ప్రముఖ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. టీవీ సెలిబ్రిటీ షోలో మహిళలపై చేసిన వ్యాఖ్యలకు గాను బిసిసిఐ వారిద్దరిన్నీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో వారు ఆస్ట్రేలియా నుంచి స్వదేశీ గడ్డకు తిరుగుముఖం పట్టారు. 

ఆట ప్రతిష్టను దెబ్బ తీసినందుకు వారిపై హర్భజన్ మండిపడ్డాడు. తన భార్య, కూతురు ఉన్నప్పుడు తమ వద్ద వారిద్దరు ఉంటే సౌకర్యంగా ఉండదని అతను అన్నాడు. 

జట్టు సభ్యులు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వారిద్దరు ఉంటే తాను తన భార్యాకూతుళ్లతో ఆ బస్సులో ప్రయాణించబోనని చెప్పాడు. మహిళను వారు ఒకే కోణంలో చూస్తున్నారని, అది సరైంది కాదని ఇండియా టుడేతో అన్నారు. 

రాహుల్, పాండ్యా వ్యాఖ్యలు ప్రతి క్రికెటర్ ప్రతిష్టను పరీక్షకు పెట్టాయని హర్భజన్ అన్నాడు. తమ మిత్రులతో కూడా తాము అలా మాట్లాడబోమని, కానీ వారిద్దరు పబ్లిక్ టెలివిజన్ లో అటువంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నాడు. 

హర్భజన్ సింగ్ అలాగే ఉంటాడని, అనిల్ కుంబ్లే, సచిన్ లు కూడా అలాగే ఉంటారని ప్రజలు అనుకునే ప్రమాదం ఉందని అన్నాడు. జట్టు సంస్కృతి గురించి మాట్లాడడానికి పాండ్యా ఎన్నాళ్లు జట్టులో ఉన్నాడని హర్భజన్ అడిగాడు. బిసిసిఐ తీసుకున్న చర్యను అతను సమర్థించాడు. 

సంబంధిత వార్తలు

ద్రవిడ్ యువతిని ఎలా కన్విన్స్ చేశాడో చూడు...పాండ్యాపై నెటిజన్ల క్లాస్

ఆసిస్ తో వన్డే మ్యాచ్.. ఆ ఇద్దరూ దూరం

పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు