టీం ఇండియా క్రికెటర్లు.. కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యాలు చేసిన వివాదాస్పద కామెంట్స్ పై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.  ఇటీవల కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలు.. పాపులర్ టీవీ షో.. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ కి హాజరైన సంగతి తెలిసిందే. అందులో పాండ్యా.. మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ చేశాడు. దీనిపై తీవ్ర దుమారం రేగింది. నెటిజన్లు కూడా తెగ మండిపడ్డారు. రాహుల్, పాండ్యాలు క్షమాపణలు చెప్పినప్పటికీ.. బీసీసీఐ కూడా వీరిపై చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యింది.

కాగా... దీనిపై తాజాగా కోహ్లీ స్పందించారు. టీం ఇండియా ఇలాంటి కామెంట్స్ కి మద్దతు పలకదని చెప్పారు. భాద్యతగల క్రికెటర్లైన తాము.. అలాంటి వాటిని సమర్థించమని చెప్పారు. అది పూర్తిగా వారి వ్యక్తిగతమన్నారు. ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని రాహుల్, పాండ్యాలు అర్థం చేసుకుంటారని కోహ్లీ అభిప్రాయపడ్డారు.

ప్యాండ్య, రాహుల్ పై చేసిన కామెంట్స్ పై బీసీసీఐ సీరియస్ గా ఉందని.. వారిపై చర్యలు తీసుకుంటుందని కోహ్లీ వివరించారు. బీసీసీఐ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కోహ్లీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేల నిషేదం...సీఓఏ ఛైర్మన్ వినోద్ రాయ్

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు