ఓ టివి కార్యక్రమంలో మహిళలను అవమానించేలా మాట్లాడిన హార్ధిక్ పాండ్యాపై బిసిసిఐ రెండు వన్డేల నిషేదాన్ని విధించడానికి సిద్దమైంది. అతడితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో యువ క్రికెటర్ కేఎల్.రాహుల్‌ కూడా ఈ నిషేదాన్ని ఎదుర్కోనున్నాడు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి  కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జీ మధ్య బిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. 

కాఫీ విత్ కరణ్ షోలో పాండ్యా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ తెలిపారు. అందుకే వారిపై రెండు వన్డేల నిషేదాన్ని విధించాలంటూ బిసిసిఐ‌కి సిపారసు చేశారు. అయితే సీఓఏ సభ్యురాలు డయానా మాత్రం ఆచి తూచి  వ్యవహరిస్తున్నారు. ఈ అంశాన్ని బిసిసిఐ లీగల్ సెల్ దృష్టికి తీసుకెళ్లిన ఆమె వారి సూచన మేరకు నడుచుకోన్నారు. 

 ఈ షోలో చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై ఇప్పటికే క్రికెటర్లిద్దరికి బిసిసిఐ వివరణ కోరింది. ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాలంటూ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. దీనిపై స్పందించిన పాండ్యా, రాహుల్ లు బిసిసిఐ కి వివరణ కూడా ఇచ్చారు. 

అయితే వారు ఇచ్చిన వివరణపై తాను సంతృప్తిగా లేనని..వెంటనే వారిద్దరిపై రెండు వన్డే మ్యాచ్ ల నిషేదం విధించాలని బిసిసిఐకి సూచించినట్లు వినోద్ రాయ్ వెల్లడించారు. వారి నిషేదానికి సంభందించి డయానా కూడా తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి వుందని...ఆమె అంగీకరిస్తే పాండ్యా, రాహుల్ లు తదుపరి జరిగే రెండు వన్డేలకు దూరం కానున్నారని వినోద్ రాయ్ తెలిపారు.  

సంబంధిత వార్తలు

హార్ధిక్ పాండ్యా, రాహుల్‌లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన బిసిసిఐ

సెక్సిస్ట్ కామెంట్లపై వివాదం.. పాండ్యా క్షమాపణలు