ఆస్ట్రేలియాతో జరగబోయచే తొలి వన్డే మ్యాచ్ లో టీం ఇండియా యువ క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలను బీసీసీఐ దూరం పెట్టేసింది. ఈ ఇద్దరు యువ క్రికెటర్లు.. ఇటీవల  పాపులర్ టీవీ షో కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే. ఈ షోలో పాండ్యా.. మహిళలను కించపరుస్తూ కొన్ని కామెంట్స్ చేశారు. కాగా ఆ కామెంట్స్ వైరల్ గా మారడంతో నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై బీసీసీఐ కూడా సీరియస్ అయ్యింది.జ

ఈ నేపథ్యంలోనే.. ఈ ఇద్దరు క్రికెటర్లను తొలి వన్డే మ్యాచ్ కి దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బోర్డు నుంచి తుది నిర్ణయం కోసం వేచి ఉన్న కారణంగా జట్టులోకి నిన్ను తీసుకోవడం లేదని పాండ్యాకు టీమ్ మేనేజ్ మెంట్ అప్పటికే స్పష్టం చేసింది. ఇక కేఎల్ రాహుల్ పేరు జట్టు పరిశీలనలో కూడా లేడని తేల్చి చెప్పారు.

ఈ ఇద్దరు క్రికెటర్లపై సస్పెన్షన్ విధిస్తారా, వాళ్లను తిరిగి ఇండియా పంపించాలా అన్న అంశంపై బోర్డు నుంచి కీలక సమాచారం కోసం మేనేజ్ మెంట్ ఎదురుచూస్తోంది. ఇప్పటికే సీఓఏ మెంబర్ అయిన డయానా ఎడుల్జీ కూడా ఈ ఇద్దరిపై సస్పెన్ష్ విధించడమే కరెక్ట్ అని చెప్పిన సంగతి తెలిసిందే.