టీం ఇండియా క్రికెటర్ హార్థిక్ పాండ్యా.. క్రికెట్ అభిమానులకు, నెటిజన్లకు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఇటీవల పాండ్యా, మరో క్రికెటర్ కేఎల్ రాహుల్ తో కలిసి కాఫీ విత్ కరణ్ కార్యక్రమానికి హాజరైన సంగతి తెలిసిందే.

ఈ కార్యక్రమంలో మహిళలను కించ పరుస్తూ.. పాండ్యా చేసిన కామెంట్స్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. అమ్మాయిలను కించపరిచేవిధంగా మాట్లాడాడు. సెక్సిస్ట్, ఉమెన్ హేటర్ లాంటి పదాలను ఉపయోగిస్తూ కొన్ని కామెంట్స్ చేశాడు.  తన పేరెంట్స్‌తో కలిసి ఓ పార్టీకి వెళ్లిన విషయాన్ని.. తనకు ఎవరెవరు యువతులతో సంబంధాలు ఉన్నదీ, తాను వర్జీనిటి కోల్పోయిన రోజు ఆ విషయాన్ని తన పేరెంట్స్‌కు ఎలా చెప్పానన్న విషయాన్నీ ఆ షోలో పాండ్యా చెప్పాడు. దీంతో.. అతనిపై తీవ్ర స్థాయిలో నెటిజన్లు ఫైర్ అయ్యారు.

కాగా.. వారికి ఈ రోజు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ‘‘ కాఫీ విత్ కరణ్ షోలో నేను చేసిన కామెంట్స్ వల్ల చాలా మంది హర్ట్ అయ్యారని తెలిసింది. అందుకే ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నాను.షో తీరు అలా ఉండటంతో నేను కూడా కాస్త హద్దు మీరాను. అంతే తప్ప ఎవరి మనోభావాలను దెబ్బ తీయడం నా ఉద్దేశం కాదు  .’’ అంటూ ట్విట్టర్ లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.