హార్థిక్ పాండ్యా ఎవరు..? అతను నాకు ఫ్రెండ్ అని మీకు ఎవరు చెప్పారు అంటూ సీరియస్ అవుతోంది బాలీవుడ్ నటి ఈశాగుప్త. గత కొంతకాలగా హార్దిక్ పాండ్యా, ఈశాగుప్తలు డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. శనివారం ఆమె.. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబయి వచ్చింది. అక్కడ ఆమెను మీడియా హార్థిక్ పాండ్యా గురించి ప్రశ్నించగా.. ఈశా ఒకరకంగా అసహనం వ్యక్తం చేసింది.

ఈ మధ్య హార్దిక్.. తన తోటి క్రికెటర్ కేఎల్ రాహుల్ తో కలిసి కాఫీ కిత్ కరణ్ షోకి హాజరయ్యాడు. ఆ షోలో మహిళలను కించపరుస్తూ.. పాండ్యా చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. దీని గురించి మీ కామెంట్ ఏమిటి అని ఈశాని ప్రశ్నించగా.. అసలు పాండ్యా ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘‘మహిళలు.. తమను తాము పురుషులతో పోల్చుకోకూడదు. ప్రతి విషయంలోనూ మహిళలు ది బెస్ట్. నేను ఎవరినీ కించపరచాలని ఈ మాటలు అనడం లేదు. పురుషులు ఎందుకు బిడ్డను కనలేరు..? అమ్మాయిలం ప్రతి నెలా ఐదు రోజులు పీరియడ్స్ తో బాధపడుతూ.. కూడా  డ్యాన్స్ చేస్తాం.. ఆఫీసులకు వెళతాం. పిల్లలను జాగ్రత్తగా పెంచుతాం. ఇవన్నీ మీరు చేయగలారా..?’’ అని ఈశా పాండ్యా కామెంట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించారు.