హైదరాబాద్: ఇటీవల ముగిసిన ట్వంటీ20 మహిళా ప్రపంచ కప్ పోటీల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై హైదరాబాద్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది తన జీవితంలో చీకటి రోజు అని ఆమె వ్యాఖ్యానించారు.

తనపై వేసిన నిందలు తనకు అంతులేని విషాదాన్ని కలించాయని, తాను తీవ్ర వేదనకు గురయ్యానని మిథాలీ రాజ్ అన్నారు. ఆట పట్ల తన నిబద్ధత, దేశం కోసం తన 20 ఏళ్ల ఆట, కఠిన శ్రమ, చెమట.. అన్నీ వృధా అయ్యాయని ఆమె అన్నారు. 

మిథాలీ రాజ్ తీరుపై కోచ్ రమేష్ పొవార్ బిసిసిఐ అధికారులకు 20 పేజీల నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. మిథాలీ రాజ్ జట్టు కోసం ఆడడం లేదని, తన వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతున్నారని రమేష్ పొవార్ ఆరోపించినట్లు తెలుస్తోంది. 

సీనియర్ క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ -- జట్టు సమావేశాల్లో ఏ విధమైన సలహాలు ఇవ్వలేదని, టేబుల్ అగ్రభాగాన నిలిచినందుకు ప్రశంసలు అందించలేదని ఆయన అన్నట్లు సమాచారం. జట్టులో తన పాత్రను విస్మరించి వ్యక్తిగత రికార్డుల కోసం ఆడారని అన్నారు.

 

సంబంధిత వార్తలు

మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

సినిమా పోస్టర్ లో చూసి ప్రేమించా.. హర్భజన్

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

26/11 ముంబయిపై దాడి: టీమిండియా పరిస్థితి ఇది

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

అరవంలో అదరగొడుతున్న ధోని కూతురు

వరల్డ్ ఛాంపియన్‌గా మేరీకోమ్...ఆరో గోల్డ్ మెడల్ కైవసం

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్