26/11 ముంబై ఉగ్రదాడి.. భారత వాణిజ్య రాజధాని చిగురుటాకులా వణికిపోయిన రోజు. 2008 నవంబర్‌ 26న జరిగిన ఈ ఘటన కొన్ని వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఛత్రపతి శివాజీ టెర్మినస్‌తో పాటు తాజ్, ఒబెరాయ్ హోటళ్ళలోని ప్రయాణికులు, టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

దేశప్రజలను ఉలిక్కిపడేలా చేసిన ఈ సమయంలో భారత జట్టు కటక్‌లో ఇంగ్లాండ్‌తో వన్డే ఆడుతోంది. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఐదవ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి 5-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.

ముంబైపై దాడి విషయం తెలుసుకున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ ఆటగాళ్లను స్వదేశానికి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో రెండు వన్డేలు రద్దయ్యాయి. అయితే ఇక్కడే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు క్రీడా స్ఫూర్తిని చాటుకుంది.

తమ జట్టు రెండు టెస్టులు ఆడేందుకు డిసెంబర్‌లో భారత పర్యటనకు వస్తుందని తెలిపింది. ఈ సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ 103 పరుగులతో సెంచరీ చేసి దానిని 26/11 బాధితులకు అంకితం ఇచ్చాడు. 

 

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కన్నుమూత

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

అరవంలో అదరగొడుతున్న ధోని కూతురు

మహిళల టీ20 ప్రపంచకప్.. నాలుగోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా

వరల్డ్ ఛాంపియన్‌గా మేరీకోమ్...ఆరో గోల్డ్ మెడల్ కైవసం

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

ధోనీ- సాక్షిల ప్రేమ, పెళ్లికి కారణం ఎవరో తెలుసా..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?