మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌‌ నుంచి తప్పించడంపై బీసీసీఐపై రేగిన దుమారం ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించకపోగా.. రోజు రోజుకి ఈ వివాదం మరింత పెద్దదవుతోంది. ఇన్నాళ్లు తనకు అవమానాలు ఎదురైనా మౌనంగానే భరించిన మిథాలీ రాజ్ ఈసారి కన్నేర్ర చేశారు.

తనను జట్టు నుంచి తప్పించడానికి బీసీసీఐ పరిపాలకుల కమిటీ సభ్యురాలు డయానా ఎడుల్జి, కోచ్ రమేశ్ పొవార్‌లే కారణమంటూ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ, జనరల్ మేనేజర్ సబా కరీంలకు సుధీర్ఘ ఈ-మెయిల్ పంపింది.

తనను దెబ్బ కొట్టడానికి వీళ్లేం చేశారో.. తానెంత మనోవేదనకు గురయ్యానో సదరు ఈ మెయిల్‌లో మిథాలీ వెళ్లగక్కారు. మరోవైపు అత్యంత రహస్యంగా ఉండాల్సిన బయటికి లీక్ కావడంపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాహుల్ జోహ్రీ, సబా కరీంలకు బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి ఆదేశించారు.

మిథాలీ రాజ్‌పై వేటు పడటంపై మాజీ క్రికెటర్లు ఫరూఖ్ ఇంజనీర్, సంజయ్ మంజ్రేకర్, శాంతా రంగస్వామి ఆమెకు బాసటగా నిలిచారు.  విజయపథంలో దూసుకెళ్తున్న భారత మహిళల జట్టులో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం బాధకరమన్నారు..

మిథాలీ లాంటి సీనియర్ క్రికెటర్‌ని ఇలా అవమానించడం సరికాదన్నారు. తనదైన ఆటతీరుతో ఎన్నో క్లిష్ట సమయాల్లో జట్టును గెలిపించిన ఆమెను కీలకమైన మ్యాచ్‌లో పక్కనబెట్టడం దారుణమైన చర్య అన్నారు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్లను తప్పించే సాహసం బీసీసీఐ చేయగలదా అని ఫరూఖ్ ప్రశ్నించారు. 

చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు

సినిమా పోస్టర్ లో చూసి ప్రేమించా.. హర్భజన్

మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్

అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ

26/11 ముంబయిపై దాడి: టీమిండియా పరిస్థితి ఇది

మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్‌పై బీసీసీఐ ఆగ్రహం

అరవంలో అదరగొడుతున్న ధోని కూతురు

వరల్డ్ ఛాంపియన్‌గా మేరీకోమ్...ఆరో గోల్డ్ మెడల్ కైవసం

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్