టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌ను తప్పించడంపై భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్‌‌ను బీసీసీఐ వివరణ కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీతో హర్మన్ ప్రీత్, మిథాలీ రాజ్ సమావేశమయ్యారు.

వేర్వేరుగా సమావేశమైన వీరిద్దరూ మ్యాచ్ రోజు పరిణామాలు, తుది జట్టు ఎంపికపై వివరాలు వెల్లడించారు. ఈ క్రమంలో పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న మిథాలీని ఎందుకు తప్పించాల్సి వచ్చిందంటూ బోర్డు హర్మన్ ప్రీత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ సమావేశంలో రాహుల్ జోహ్రీతో పాటు జనరల్ మేనేజర్ (ఆపరేషన్స్) సభా కరీం, టీమిండియా మేనేజర్ తృప్తి భట్టాచార్య పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ.. ఆటగాళ్లు వారి వైపుగా ఏం చెప్పాలో అది చెప్పారు.. మేం ప్రతి అంశాన్ని రాసుకున్నామన్నారు’’.

కోచ్ రమేశ్ పవార్‌, సభా కరీంలను బుధవారం కలిసి.. ఆ తర్వాత అన్ని అంశాలతో కలిపి పరిపాలకుల కమిటీ (సీఓఏ)కు బీసీసీఐ తుది నివేదిక అందజేస్తుంది. పాకిస్తాన్, ఐర్లాండ్‌లపై వరుస అర్థసెంచరీలు చేసి మంచి ఫిట్‌నెస్‌తో పాటు భీకర ఫాంలో ఉన్న మిథాలీ రాజ్‌ను సెమీఫైనల్లో పక్కనబెట్టడంపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కెప్టెన్ హర్మన్ ప్రీత్‌పై మండిపడుతున్న సంగతి తెలిసిందే. 

అరవంలో అదరగొడుతున్న ధోని కూతురు

హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్

పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...

టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్‌పై అభిమానుల ఫైర్

నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్

క్రికెట్‌లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?

బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?

గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...