టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీపై ఇండియన్  క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. టీమిండియా తరపున 90 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన ధోనీ యువ ఆటగాళ్లను ప్రొత్సహించాలనే ఉద్దేశ్యంతో టెస్టుల నుంచి రిటైరయ్యాడు.

అలా ఆలోచించడమే అతని గొప్పతనం..దేశం కోసం పాటుపడే క్రికెటర్ ధోనీ. నా దృష్టిలో భారత క్రికెటర్లలో మహేంద్రుడే అత్యుత్తమ ఆటగాడు. ధోనీ సారథ్యంలోనే భారత్ 2011 ప్రపంచకప్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్‌ను గెలుపొందింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ ఆధ్యాయాన్ని లిఖించుకున్న ధోనీ వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచకప్‌లోనూ ఆడాలని కోరుకుంటున్నా అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.

టెస్టుల నుంచి తప్పకున్న తర్వాత కేవలం వన్డేలు, టీ20లలో మాత్రమే ధోనీ ఆడుతున్నాడు. అయితే ఇటీవలి ఇంగ్లాండ్ పర్యటనలో అతని పేలవ ప్రదర్శన కారణంగా తాజా ఆస్ట్రేలియా పర్యటనలో ధోనిని సెలక్టర్లు పక్కనబెట్టారు. దీంతో మహేంద్రుడు వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ లో పాల్గొంటాడా లేదా అంటూ దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

గౌతమ్ గంభీర్‌పై చీటింగ్ కేసు...నోటీసులు జారీ చేసిన డిల్లీ కోర్టు

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...

ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు.. రేటెంతంటే..?

స్పిన్నర్ ఉంటే గెలిచే వాళ్లమేమో: షమీ

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?

సంబరపడకండి...ఇంకా రెండు టెస్టులున్నాయ్: గంగూలీ