పెర్త్ టెస్టులో ఓటమిపై టీమిండియా పేసర్ షమీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తనతో సహా పేసర్లంతా చాలా బాగా బౌలింగ్ చేశారని అయితే టీమ్‌లో ఒక స్పిన్నర్ ఉంటే బాగుండేదని అతడు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లైయన్ ఏడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకభూమిక పోషించాడన్నాడు.

‘‘ ఈ నిర్ణయాలన్నీ మేనేజ్‌మెంట్ తీసుకుంటుంది. మేం చేసేదేమీ లేదు.. చాలాకాలం తర్వాత ఒకేసారి నలుగురు పేసర్లం బరిలో నిలిచామని.. సరైన ప్రాంతాల్లో బంతులు విసురుతున్నామని షమీ అభిప్రాయపడ్డాడు. నాలుగేళ్ల క్రితం తమకు ఇంత అనుభవం లేదని.. అప్పటితో పోలీస్తే భారత బౌలింగ్‌లో నాణ్యత పెరిగిందన్నాడు.  

తానెప్పుడూ వికెట్లు తీసేందుకే ఆలోచిస్తానని.. వికెట్లు పడుతుంటే మ్యాచ్ స్వభావమే మారిపోతుందన్నాడు. తొలి రెండు రోజులు పిచ్ చాలా బాగుందని.. మూడో రోజు నుంచి ఊహించని విధంగా బౌన్స్ అవుతోందని అన్నాడు.

కోహ్లీ, పైన్ వార్ గురించి ప్రస్తావిస్తూ.. ఆటలో ఇవన్నీ భాగమని.. అంత తీవ్రంగా ఇద్దరూ కొట్టుకోవడం లేదన్నాడు. పెర్త్ టెస్టులో భారత్.. ఆస్ట్రేలియా చేతిలో 146 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

రూ.8కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్

యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..

భారీ ధర పలికిన ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?