టీంఇండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఆయనకు డిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో ఓ రియల్ ఎస్టేస్ సంస్థకు గంభీర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. అయితే అదే సంస్ధ గంభీర్ పై  చీటింగ్ కేసు పెట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా డిల్లీ కోర్టు గంభీర్ కు తాజాగా నోటీసులు జారీ చేసింది. 

గంభీర్ రుద్ర బిల్డ్‌వెల్ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో గంభీర్ తమను మోసం చేశాడంటూ ఈ సంస్థ ప్రతినిధులు చీటింగ్ కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా జనవరి 24, 2019 లోగా గంభీర్ తమ ఎదుట హాజరవ్వాలని కోర్టు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. 

ఇటీవలే గంభీర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అన్ని పార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలా క్రికెట్ కు వీడ్కోలు పలికి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో గంభీర్ ను వివాదాలు వెంటాడుతున్నాయి. 

గంభీర్ కొద్ది రోజుల క్రితమే మాజీ కెప్టెన్ ధోనిపై విమర్శలు చేసి వివాదానికి కారణమయ్యారు. ధోని గతంలో జట్టు ఎంపికలో తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఇలా ధోనిపై గంభీర్ చేసిన విమర్శలకు క్రికెట్ అభిమానులతో పాటు మాజీల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యింది. గంభీర్ చీవాట్లు పెడుతూ చాలా మంది సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు.