భారత స్టార్ షట్లర్లు.. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు.. ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 14న సింపుల్ గా రాయదుర్గంలోని సైనా నివాసం ‘ఒరియన్ విల్లా’ లో వీరిద్దరూ సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని నోవాటెల్ లో సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా రిసెప్షన్ చేసుకున్నారు.

ఈ రిసెప్షన్ సైనా, కశ్యప్ జంట స్వయంగా వెళ్లి మరీ... కేటీఆర్ ని పెళ్లికి ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని మన్నించి.. కేటీఆర్ కూడా రిసెప్షన్ కి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు.  కేటీఆర్ రిసెప్షన్ కి వచ్చినందుకు థ్యాంక్స్ చెబుతూ.. కశ్యప్ ఈ రోజు ట్వీట్ చేశారు. అయితే.. ఆ ట్వీట్ లో  సీక్రెట్ స్టోరీ గురించి కూడా ప్రస్తావించారు.

‘‘మీ ఆశీస్సులు అందించినందుకు ధన్యవాదాలు సర్. మా సీక్రెట్ స్టోరీ మీతోనే సేఫ్‌గా ఉండాలి.’’ అంటూ కేటీఆర్‌తో తమ దంపతులు ఉన్న ఫొటోను కశ్యప్ ట్వీట్ చేశారు. దీంతో.. ఆ సీక్రెట్ స్టోరీ ఏంటా..? అని నెటిజన్లు ట్వీట్ల రూపంలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరేమో.. సైనా, కశ్యప్ ల లవ్ స్టోరీ అయ్యి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. మొత్తాన్ని కశ్యప్ ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది.