Asianet News TeluguAsianet News Telugu

సంబరపడకండి...ఇంకా రెండు టెస్టులున్నాయ్: గంగూలీ

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమిపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుదిజట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల పనితీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ విమర్శలకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు

Sourav ganguly comments over perth test
Author
Kolkata, First Published Dec 20, 2018, 11:28 AM IST

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమిపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుదిజట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల పనితీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు సైతం పెదవి విరుస్తున్నారు.

ఈ విమర్శలకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు. ఒక్క ఓటమికే భారత్ పనైపోయినట్లే అంటూ సామాజిక మాధ్యమాల్లో పలువురు అభిప్రాయపడుతున్నారని.. దీనిపై ఆసీస్ మీడియా అతి చేస్తోందంటూ గంగూలి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భారత్ గెలవనలేదని మీడియాలోనూ.. సామాజిక మాధ్యమాల్లోనూ చర్చలు సాగుతున్నాయి. టీమిండియా గెలవడానికి ఇంకా రెండు టెస్టులు ఉన్నాయి. అవి రెండూ పూర్తవ్వకముందే చాలా దూరం వెళ్లకండి అంటూ సౌరవ్ ట్వీట్ చేశాడు.

ఐపీఎల్-2019 వేలం: ఎవరిని ఎవరు కొన్నారు, సన్‌రైజర్స్ టీమ్ ఇదే

గౌతమ్ గంభీర్‌పై చీటింగ్ కేసు...నోటీసులు జారీ చేసిన డిల్లీ కోర్టు

ఐపీఎల్ వేలంపాటపై తివారీ ఆవేదనతో కూడిన ట్వీట్...

ఏంటి ఆ సీక్రెట్ స్టోరీ..? వైరల్ గా కశ్యప్ ట్వీట్

ఐపీఎల్‌లో రాజోలు కుర్రాడు.. రేటెంతంటే..?

స్పిన్నర్ ఉంటే గెలిచే వాళ్లమేమో: షమీ

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?

Follow Us:
Download App:
  • android
  • ios