మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సెంచరీల గురించి, వ్యక్తిగత ప్రదర్శనల గురించి మాట్లాడటం అనవసరం అని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత్ 146 పరుగుల తేడా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

జట్టు ఓటమి గురించి తాజాగా కోహ్లీ స్పందించాడు.  ‘‘జట్టుగా మేం బాగానే ఆడాం. కానీ ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాకంటే అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. ఈ పిచ్‌పై 330 పరుగులు చాలా ఎక్కువ. వారు విజయానికి అర్హులు. మా బౌలర్లు అద్భుతంగా రాణించారు.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘ పిచ్‌ను పరిశీలించినప్పుడు మాకు జడేజా గుర్తుకు రాలేదు. ఆ సమయంలో నలుగురు పేసర్లు చాలు అనుకున్నాం. కానీ నాథన్‌ అద్భుతంగా రాణించాడు. ఓడినప్పుడు వ్యక్తిగత ప్రదర్శనల గురించి ప్రస్తావించడం అనవసరం. నా వికెట్‌ విషయంలో అంపైర్‌ నిర్ణయంపై కూడా స్పందించడం వృథా. అది మైదానంలో జరిగింది. అక్కడే వదిలేయాలి. ప్రస్తుతం నా దృష్టంతా తదుపరి మ్యాచ్‌పైనే’’అని కోహ్లి చెప్పుకొచ్చాడు.