ఇండియన్ ప్రీమియర్ లీగ్-2019 సీజన్‌కు గాను ఆటగాళ్ల వేలం మంగళవారం జైపూర్‌లో ముగిసింది. ఇందులో ఆంధ్రా కుర్రాడు ఒకరు ప్లేస్ కొట్టేశాడు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన బండారు అయ్యప్పను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వేలంలో కొనుగోలు చేసింది.

ఇతనిని రూ.20 లక్షలు వెచ్చించి తన సొంతం చేసుకుంది. మీడియం పేసరైన అయ్యప్ప 2018-19 దులీప్ ట్రోఫీలో ఇండియా బ్లూ జట్టుకు సెలెక్ట్ అయ్యాడు.. ఇంతకు ముందు ఢిల్లీ జట్టులోనే ఉన్న అయ్యప్పను ఆ జట్టు యాజమాన్యం మరోసారి కొనుగోలు చేయడం గమనార్హం.

మంగళవారం జరిగిన వేలంలో మొత్తం 351 మంది ఆటగాళ్లు రాగా.. 60 మందిని 8 ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. కాగా, తొలి రౌండ్‌లో యువరాజ్‌ను పక్కన బెట్టిన ఫ్రాంఛైజీలు.. రెండో రౌండ్ వేలంలో కనీస ధర కోటి రూపాయలకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోవడంతో యువీ గట్టెక్కాడు.

 

రూ.8కోట్లు పలికిన జయదేవ్ ఉనద్కత్

యువరాజ్ సింగ్ కి ఫ్రాంఛైజీల షాక్..

భారీ ధర పలికిన ఆంధ్రా క్రికెటర్ హనుమ విహారి

జడేజాను కొట్టబోయిన ఇషాంత్.. ఆలస్యంగా వెలుగులోకి

ఓడిపోయిన తర్వాత సెంచరీ గురించి ఎందుకు..?