టెస్ట్ క్రికెట్ కి వరల్డ్ కప్:పూర్వ వైభవం వచ్చేనా?
టెస్ట్ క్రికెట్ రాను రాను ఆదరణ కోల్పోతుంది. అయితే వన్డే, టీ 20 ల మాధిరిగానే టెస్ట్ క్రికెట్ లో కూడ ప్రపంచ కప్ పోటీలను నిర్వహించేందుకు ఐసీసీ సన్నాహలు చేస్తోంది. ఈ మేరకు ఐసీసీ కొత్త గైడ్‌లైన్స్ ను రూపొందించింది.
న్యూఢిల్లీ: క్రికెట్లోని అన్ని ఫార్మాట్లలో టెస్ట్ క్రికెట్ ని క్లాసిక్ గా పేర్కొంటారు క్రికెట్ అభిమానులు. కానీ కాలం గడుస్తున్నకొద్దీ, పొట్టి ఫార్మాట్లు ఎక్కువవ్వడంతోని టెస్ట్ క్రికెట్ కి ఆదరణ కరువయ్యింది. చాలా సార్లు టెస్ట్ క్రికెట్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచెస్ వంటివి నిర్వహించినప్పటికీ అవి అంత ఆదరణకు నోచుకోలేదు.
ఎలాగైనా టెస్ట్ క్రికెట్ కి గత ప్రఖ్యాతి తీసుకురావాలని సంకల్పించిన ఐ సి సి టెస్ట్ క్రికెట్ కి కూడా ప్రపంచ కప్ నిర్వహించేందుకు నడుం బిగించింది. ఇది ఎలా ఉంటుంది ఏఏ దేశాలు పాల్గొంటాయి, ఎన్ని రోజులు సాగుతుంది వంటి విషయాలతోపాటు అసలు ఈ ప్రయోగం విజయవంతం అవుతుందా లేదా తెలుసుకుందాం.
2019-2021 జూన్ వరకు దాదాపు రెండు సంవత్సరాలపాటు ఈ మెగా టోర్నీ సాగనుంది. ఇందులో టెస్ట్ హోదా ఉన్న తొమ్మిది జెట్లు పాల్గొననున్నాయి (జింబాంబ్వే మినహాయిస్తే). ప్రతి దేశం తనకు నచ్చిన జెట్లతో ఆరు ద్వైపాక్షిక సిరీస్ లు ఆడవాలిసి ఉంటుంది.
ప్రతి సిరీస్ కి 120 పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. అంటే, ఒక వేళా ఏదైనా జట్టు రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడితే ఒక్కో మ్యాచ్ కు 60 పాయింట్లు, 3 మ్యాచ్ ల సిరీస్ ఆడితే, ఒక్కో మ్యాచ్ కు 40 పాయింట్లు, ఇలా సాగుతుంది ఈ టోర్నీ. చివరకు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జెట్లు 2021లో ఇంగ్లాండ్ లో జరిగే ఫైనల్ లో తలపడతాయి.
ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తలపడే యాషెస్ టెస్ట్ సిరీస్ తో ఈ గ్రాండ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇండియా విండీస్ టూర్ తో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ 6 ద్వైపాక్షిక సిరీస్ లలో 3 సిరీస్లను స్వదేశం లో ఆడాల్సి ఉండగా, 3 విదేశాలలో ఆడాలి అనే నిబంధనను విధించింది ఐ సి సి.
ఈ ఈవెంట్ ను మరింతగా ఆకర్షణీయంగా మార్చేందుకు కామెంటేటర్లు స్లిప్ ల వెనుక భాగం లో గ్రౌండ్ మీద దర్శనం ఇవ్వబోతున్నారు. అంతే కాకుండా ప్లేయర్స్ తమ పేర్లు ఉన్న జెర్సీలను ధరించనున్నారు. ఒకవేళ ఎండ 35 డిగ్రీలు దాటితే ప్లేయర్స్ షార్ట్స్ కూడా వేస్కొవచ్చు అనే వెసులుబాటును ఐ సి సి కల్పించింది.
ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ మెగా ఈవెంట్ ని ఇంకా బాగా నిర్వహించి ఉండవచ్చు . ముఖ్యంగా రెండు సంవత్సరాలపాటు ఏదైతే కాలం ఉందొ అది బాగా ఎక్కువవ్వడం వల్ల అభిమానులు ఇంటరెస్ట్ కోల్పేయే అవకాశాలు మెండు.
దీనిని మరింత కలర్ ఫుల్ గా చేయడానికి ఈ కాలాన్ని కుదిస్తే బాగుండేది. ప్రతి దేశం తనకు నచ్చిన దేశాన్ని ఎన్నుకోవచ్చు అని చెప్పినప్పుడు బెస్ట్ టీమ్ ఇంకో బెస్ట్ టీం తోని ఆడటానికి ఇష్టపడకపోవచ్చు. ఇలా గనుక జరిగితే ఎటువంటి టఫ్ టీమ్స్ ని ఆడకుండానే ప్రపంచ ఛాంపియన్ గా అవతరించే అవకాశం కూడా లేకపోలేదు.
ఇంకో మైనస్ ఏంటంటే ద్వైపాక్షిక సిరీస్ లకు ఒక కాంటెక్స్ట్ ఇచ్చారే తప్ప వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ గా మాత్రం ఇది కనపడడం లేదు.దీన్ని మరింత ఇంటరెస్టింగ్ గా మార్చడానికి రెండు సంవత్సరాలు కాకుండా ఆరు ఏడు నెలలపాటు కేవలం టెస్ట్ మ్యాచ్లు మాత్రమే నిర్వహించి ఉంటే బాగుండేది. అప్పుడు టెస్ట్ క్రికెట్ గురించి మాత్రమే క్రికెట్ అభిమానులు మాట్లాడుకుంటుండేవారు.
అప్పుడు టెస్ట్ క్రికెటవికి దక్కవలిసిన గుర్తింపు ఆదరణ కూడా వచ్చి ఉండేవి. అంతే కాకుండా కేవలం టెస్ట్ క్రికెట్ ని మాత్రమే ఆడించి వుంటే స్పాన్సర్షిప్ కూడా వచ్చి ఉండేది. టెస్ట్ క్రికెట్ కి ఆదరణ కరువవ్వడానికి స్పాన్సర్షిప్ లేమి కూడా ఒక ప్రధాన కారణం. వేరే ఏ మ్యాచ్ లు లేనందున స్పాన్సర్స్ ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడేవారు.
ఇలా కనుక కేవలం టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే నిర్వహించి ఉంటె వ్యూయర్షిప్ కూడా పెరిగేది. ఇంకో ఆప్షనే లేనప్పుడు అభిమానులు టెస్ట్ లను వీక్షించేవారు. నూతన వ్యూయర్స్ కూడా వచ్చేవారు. తద్వారా టెస్ట్ క్రికెట్ ఓవరాల్ హెల్త్ బాగుండేది. మరింత ఆకర్షణీయంగా మార్చడానికి 4 డే టెస్ట్ మ్యాచ్ లను , డే అండ్ నైట్ టెస్ట్ లను పెట్టినా కూడా ఉపయుక్తకరంగా ఉండేది.
ప్రత్యేకించి ఉపఖండం లో టెస్ట్ మ్యాచ్ లను వన్ డే టి 20 ఫార్మాట్లలో మధ్యలోని గ్యాప్స్ ని పూరించడానికి ఫిల్లర్లు లా వాడుతున్నారు తప్ప టెస్ట్ క్రికెట్ ని అంత ప్రధానంగా పట్టించుకోవడంలేదు. కారణం ఎవ్వరు చూడడం లేదు. ఇలాంటి అన్ని ప్రాబ్లంలకు ఇది ఒక సర్వ రోగ నివారిణి గా పనిచేసేది.
ఏది ఏమైనా టెస్ట్ క్రికెట్ ఇక అంతరించిపోతుందేమో అనే ఒక భయం మాత్రం కొద్ది కొద్దిగా తొలిగిపోతుంది. ఇంకొన్ని నూతన మార్పులు చేసి వచ్చేసారి మరింత ఆకర్షణీయంగా గనుక మారిస్తే అభిమానులంతా ధనాధన్ ఫార్మాట్ ల మాదిరిగానే టెస్ట్ క్రికెట్ లోని మజాను కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.