ప్రపంచంలోని టాప్-10 అందమైన మహిళా క్రికెటర్లు ఎవరో తెలుసా?
top 10 Beautiful Women Cricketers : బ్యాట్, బాల్ తోనే కాదు అందంలోనూ అదరగొడుతూ ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నారు పలువురు ప్లేయర్లు. అలాంటి ప్రపంచంలోని టాప్-10 అందమైన మహిళా క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
top 10 Beautiful Women Cricketers : గత కొన్ని సంవత్సరాలుగా మహిళల క్రికెట్ కు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. మహిళా క్రికెటర్లు మైదానంలో అద్భుతమైన ప్రదర్శనలో ఆకట్టుకుంటున్నారు. మరికొంత మంది ప్లేయర్లు బ్యాట్, బాల్ తోనే కాదు అందంలోనూ అదరగొడుతూ ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్నారు. వారి విజయాలు, వారి జీవన శైలి క్రికెట్ పైనే కాదు సమాజం పై కూడా ప్రభాదం చూపుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ప్రపంచంలోని టాప్-10 అందమైన మహిళా క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఎల్లీస్ పెర్రీ - ఆస్ట్రేలియా
ఎల్లీస్ పెర్రీ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్. మహిళల క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన ఆమె క్రికెట్ తో పాటు సాకర్ లోనూ రాణించింది. ఎల్లీస్ పెర్రీ సూపర్ స్మైల్ తో అందరినీ ఆకర్షిస్తుంది. ఆమె సహజ సౌందర్యం, మైదానంలో ఆమె ఆల్ రౌండ్ షో ప్రపంచంలోని అందమైన మహిళా క్రికెటర్లలో ఒకరిగా నిలబెట్టింది. పెర్రీకి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది అభిమానులు ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన అతి పిన్న వయస్కులై ఆస్ట్రేలియ క్రికెటర్ గా గుర్తింపు సాధించారు. 2017 లో ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. అనేక టోర్నమెంట్లలో అత్యధిక పరుగులు, వికెట్ టేకర్ గా కూడా నిలిచారు.
2. స్మృతి మంధాన - భారత్
స్మృతి మంధాన భారత స్టార్ క్రికెటర్, ఓపెనింగ్ బ్యాటర్. దూకుడు బ్యాటింగ్ శైలితో అద్భుతమైన ఇన్నింగ్స్ లతో గుర్తింపు పొందారు. స్మృతి తన అద్భుతమైన లుక్స్ స్టైలిష్ తో ప్రపంచ క్రికెట్ లో అందమైన టాప్10 క్రికెటర్ల జాబితాలో చోటు సంపాదించారు. గ్రౌండ్ లో తన బ్యాట్ పవర్ తో పాటు ఆమె ఫ్యాషన్ సెన్స్ కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎంతో మందికి స్మృతి మంధాన స్టైల్ ఐకాన్‌గా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు అనేక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. స్మృతి మంధాన 2018 సంవత్సరంలో ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా నిలిచారు. అలాగే, 2018 మహిళల T20 ఛాలెంజ్‌లో లీడింగ్ రన్ స్కోరర్, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నారు.
3. ఇసా గుహ - ఇంగ్లండ్
ఇసా గుహా మాజీ ఇంగ్లండ్ క్రికెటర్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. క్రికెట్ కు ఆమె గ్రౌండ్ లోనే కాదు దాని వెలుపల కూడా గణనీయమైన కృషి చేశారు. ఇసా అందంతో పాటు మంచి క్రికెటర్ గా, ఆధునిక శైలి, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. తన ఆట, అందంతో ఎంతో మందికి రోల్ మోడల్ గా,చాలా మంది యువతులను క్రికెట్‌లో పాల్గొనేలా ప్రేరేపించారు. మహిళా క్రికెట్ ను ప్రోత్సహించడంలో ప్రముఖ స్వరంగా ఉన్నారు. 2009 ఐసీసీ మహిళల ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో భాగంగా ఉన్నారు.
4. కైనత్ ఇంతియాజ్ - పాకిస్తాన్
కైనత్ ఇంతియాజ్.. సంకల్పం, పట్టుదలతో క్రికెట్ లో మంచి నైపుణ్యాలు సాధించి ఆల్ రౌండర్‌గా ఎదిగింది ఈ పాకిస్థానీ క్రికెటర్. కైనాత్ ఆకర్షణీయమైన లుక్స్, అందంలో సినిమా హీరోయిన్లకు తక్కువ కాదు. 2010లో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన కైనత్.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అద్భుతంగా రాణించారు.
5. ఐసోబెల్ జాయిస్ - ఐర్లాండ్
ఐరిష్ క్రికెటర్ ఐసోబెల్ జాయిస్ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనలతో ఐర్లాండ్‌కు కీలక ప్లేయర్ గా మారారు. ఐసోబెల్ సహజ సౌందర్యం, సొగసైన ఫ్యాషన్ సెన్స్ ఆమెను క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఐసోబెల్ ఐర్లాండ్ మహిళా క్రికెట్ ను ఎంతగానో ప్రభావితం చేశారు. ఐరిష్ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఇచ్చిన ప్లేయర్ల లిస్టులో ఐసోబెల్ జాయిస్ పేరు తప్పకుండా ఉంటుంది.
6. హోలీ ఫెర్లింగ్ - ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ హోలీ ఫెర్లింగ్ తన అద్భుతమైన పేస్, కచ్చితత్వంతో వేసే బౌలింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హోలీ అద్భుతమైన లుక్స్ - అథ్లెటిక్ బిల్డ్ ఆమె చిక్ స్టైల్‌తో ప్రపంచంలో అందమైన టాప్10 క్రికెటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆమె ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మైదానంలోనే కాదు దాని వెలుపల ఆమెకు చాలా మంది అభిమానులను సంపాదించిపెట్టింది. చిన్న వయసులోనే ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశారు. అంతర్జాతీయ టోర్నమెంట్లలో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు.
7. మిథాలీ రాజ్ - భారత్
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీడారంగంలో ఒక లెజెండ్. మిథాలీ భారత్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది యంగ్ ప్లేయర్లకు స్ఫూర్తిగా నిలిచారు. అంతర్జాతీయ క్రికెట్ లో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. భారత్‌లో మహిళా క్రికెట్‌కు ఆదరణ కల్పించడంలో మిథాలీ కీలకపాత్ర పోషిస్తోంది.ఆమె అందమైన చిరునవ్వు, సహజ సౌందర్యం ప్రపంచ అందమైన టాప్10 క్రికెటర్లలో ఒకరిగా నిలబెట్టింది. మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి మిథాలి. పద్మశ్రీతో సహా అనేక అవార్డులు అందుకున్నారు.
8. సారా టేలర్ - ఇంగ్లండ్
ఇంగ్లాండ్ వికెట్ కీపర్-బ్యాటర్ సారా టేలర్. వికెట్ల దగ్గర ఆమె కదిలే వేగం, అద్బుతమైన బ్యాటింగ్ తో గుర్తింపు పొందారు. సారా చిరునవ్వు - స్పోర్టి స్టైల్ ఆకట్టుకుంటుంది. మానసిక ఆరోగ్య సమస్యల గురించి ఆమె బహిరంగంగా చెప్పడం చాలా మందికి స్ఫూర్తినిచ్చింది. అనేక ఐసీసీ టోర్నమెంట్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టులో ప్లేయర్ గా ఉన్నారు. వికెట్ కీపర్ - బ్యాటర్ గా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు.
9. డేన్ వాన్ నీకెర్క్
అద్భుతమైన కెప్టెన్సీ, ఆల్ రౌండ్ ప్రదర్శనలతో ప్రపంచ మహిళా క్రికెట్ లో ప్రత్యేక గుర్తింపు సాధించిన డేన్ వాన్ నీకెర్క్ ఒక దక్షిణాఫ్రికా క్రికెటర్. డేన్ ప్రత్యేక శైలి, ఆకర్షణీయమైన ఆమె అందం మహిళా క్రికెట్ లో ప్రత్యేకంగా నిలబెట్టాయి. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ వృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారు. దక్షిణాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్, అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నారు.
10. లారా మార్ష్ - ఇంగ్లండ్
ఇంగ్లండ్ కు చెందిన క్రికెటర్ లారా మార్ష్ తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సాధించారు. లారా క్లాసిక్ అందంతో క్రికెట్ లో అందమైన ప్లేయర్ గా గురింపు పొందారు. మహిళల క్రికెట్‌లో ఇంగ్లండ్ విజయంలో ఆమె సహకారం చాలా గొప్పది. ఐసీసీ టోర్నమెంట్‌లను గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టులో భాగంగా ఉన్నారు. బౌలర్ గా చాలా సార్లు అద్భుత ప్రదర్శనలు చేశారు.
- Australia
- Cricket
- Dane van Niekerk
- Ellyse Perry
- England
- Holly Ferling
- ICC Women's T20 World Cup
- ICC Women's World T20 ICC Women's T20 World Cup
- India
- Isa Guha
- Isobel Joyce
- Kainat Imtiaz
- Laura Marsh
- List of Beautiful Women Cricketers
- Mithali Raj
- Sarah Taylor
- Smriti Mandhana
- South Africa
- Women Cricket
- top 10 Beautiful Women Cricketers
- ICC Women's T20 World Cup2024