అనంతపురంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ సందడి చేశాడు. గురువారం కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామానికి వెళుతూ మార్గమధ్యంలో ఆయన అనంతపురంలోని ఆర్డీటీ క్రికెట్ స్టేడియంను అతను సందర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  భారత్ లో క్రికెట్ ప్రోత్సాహం బాగుందని మెచ్చుకున్నారు.ఆర్డీటీ క్రికెట్ స్టేడియం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఇండియాలో క్రికెట్‌ను బాగా ఆరాధిస్తున్నారని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో భారత జట్టు ప్రదర్శన చాలా బాగుందని, మిగిలిన జట్లకు టీమిండియా ప్రమాదకరంగా మారిందన్నారు. ఆసీస్‌ జట్టు ఆటతీరుపై స్పందిస్తూ.. సహజంగా ఒక్కోసారి కొన్ని మార్పులు జరుగుతుంటాయని, ఫీల్డింగ్‌లో కాస్త తడబాటు ఉందని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. అతడి వెంట ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ తదితరులు ఉన్నారు.