Search results - 104 Results
 • imran khan

  CRICKET20, Feb 2019, 12:53 PM IST

  పుల్వామా దాడి: ఇక్కడ కూడా ఇమ్రాన్ ఫోటో ఔట్

  పుల్వామాలో ఉగ్రదాడికి పాకిస్తాన్‌పై దేశప్రజలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో ఉన్న పాక్ క్రికెటర్ల ఫోటోలను తొలగించిన విషయం తెలిసిందే.. తాజాగా ఇదే బాటలో నడిచింది హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్. 

 • pawan

  Andhra Pradesh20, Feb 2019, 7:46 AM IST

  జనసేన టికెట్ కోసం.. టీమిండియా క్రికెటర్ దరఖాస్తు

  త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసేందుకు పలువురు ఆశావహులు పోటీ పడుతున్నారు. టికెట్ కావాలని ఆశపడుతున్న వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచన మేరకు ఆశావహుల నుంచి భారీగానే స్పందన వస్తోంది. 

 • CRICKET19, Feb 2019, 4:22 PM IST

  క్రికెట్ కంటే దేశమే ముఖ్యం... ప్రపంచకప్‌లో పాక్‌ మ్యాచ్‌ను బహిష్కరించాలి: హర్భజన్

  ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాన్ని దూరం పెట్టడం చాలా మంచిదని సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పేర్కొన్నారు. కేవలం ఇరుదేశాల మధ్య రాజకీయ,వాణిజ్య సంబంధాల్లోనే కాదు అన్ని రకాల క్రీడల్లోను పాక్ తో భారత్ తెగదెంపులు చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. టీంఇండియా క్రికెట్ జట్టు ప్రస్తుతం కేవలం ద్వైపాక్షిక సీరిసుల్లో మాత్రమే పాక్ జట్టుతో ఆడటంవలేదని...ఇకనుంచి ఐసిసి నిర్వహించే టోర్నీల్లో కూడా పాక్‌తో ఆడకూడదని హర్భజన్ సూచించారు. 

 • gayle

  CRICKET18, Feb 2019, 8:21 AM IST

  వన్డేలకు గేల్ గుడ్‌బై...ఈ ప్రపంచకప్పే చివరిది..!!!

  ప్రపంచ క్రికెట్‌లోని విధ్వంసక ఆటగాళ్లలో ఒకడైన వెస్టిండీస్ డాషింగ్ బ్యాట్స్‌‌మెన్ క్రిస్‌గేల్ వన్డేలకు వీడ్కోలు పలికాడు. ఈ ఏడాది జరగనున్న  ప్రపంచకప్‌తో వన్డే కెరీర్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.

 • crpf

  CRICKET17, Feb 2019, 10:48 AM IST

  పుల్వామా దాడి: అమర జవాన్ల పిల్లలను చదివించనున్న సెహ్వాగ్

  జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ సైనికుల కుటుంబాలకు భారతావని అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజలు సైనిక సంక్షేమ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.

 • sanjay

  CRICKET16, Feb 2019, 12:45 PM IST

  దినేశ్ కార్తిక్ పని అయిపోయినట్లే...కేవలం ప్రపంచకప్‌లోనే కాదు...: సంజయ్ మంజ్రేకర్

  ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టీ20 సీరిస్ కు ఎంపికైన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ కు వన్డే జట్టులో అవకాశం లభించలేదు. వన్డే ప్రపంచ కప్ కు ముందు ఇలా దినేశ్ కార్తీక్ ను వన్డే సీరిస్ కు ఎంపికచేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ జట్టును ఎంపికచేశారు కాబట్టి ఇక కార్తిక్ పని అయిపోయినట్లేనని పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆ  అనుమానాలన్నీ నిజమవనున్నాయని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Ehsan Mani

  CRICKET15, Feb 2019, 9:43 PM IST

  భారత ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో ఆడించాలి: పిసిబి ఛైర్మన్

  పాకిస్థాన్ సూపర్ లీగ్... దుబాయ్ వేదికగా గత మూడేళ్లుగా పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. అయితే ఈ లీగ్ లో అన్ని దేశాల క్రీడాకారులు ఆడుతున్నా భారత ఆటగాళ్లు మాత్రం ఆడటం లేదు. పాకిస్థాన్-ఇండియాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆ ప్రభావం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. దీంతో బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ కు పాక్ క్రికెటర్లు దూరమవగా...పాకిస్థాన్ పీఎస్ఎల్ కు భారత ఆటగాళ్లు దూరంగా వుంటున్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

 • Hanuma Vihari

  CRICKET15, Feb 2019, 5:57 PM IST

  తెలుగు క్రికెటర్ హనుమ విహారీ అరుదైన ఘనత...

  తెలుగు క్రికెటర్ హనుమ విహారి రంజీ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా తరపున బరిలోకి దిగిన విహారి తన బ్యాట్ ను ఝలిపించాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ సెంచరీలతో ఇప్పటివరకు ఇరానీ కప్ టోర్నీ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా విహారీ  అరుదైన ఘనత సాధించాడు. 

 • CRICKET13, Feb 2019, 8:16 PM IST

  ''ప్రపంచ కప్‌ ఆడటానికి విజయ్ శంకర్ అర్హుడే''

  వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో తమ దేశం తరపున పాల్గొనాలని ప్రతి ఆటగాడు భావిస్తుంటాడు. అయితే అవకాశం కొంతమందిని మాత్రమే వరిస్తుంది. మరికొన్ని రోజుల్లో
  ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఎంపికను సెలెక్టర్లు ప్రారంభించారు. భారత జట్టును సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఎంపిక చేయనున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే వెల్లడించాడు. ఇటీవల మంచి  ఫామ్ తో అత్యుత్తమంగా  ఆడుతున్న యువ  ఆటగాళ్లు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల పేర్లను వరల్డ్ కప్ కోసం పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. 

 • shane warne

  CRICKET13, Feb 2019, 5:47 PM IST

  వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించాలి...ఎందుకంటే: షేన్ వార్న్

  మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 విజేతగా నిలిచే అన్ని అర్హతలు టీంఇండియాకు వున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్ కితాబిచ్చాడు.  అయితే అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు. 

 • SPORTS12, Feb 2019, 4:24 PM IST

  రైనా చనిపోయాడంటూ ప్రచారం.. స్పందించిన ఆల్ రౌండర్

   ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సురేష్ రైనా చనిపోయారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

 • root

  CRICKET12, Feb 2019, 1:56 PM IST

  ‘‘గే’’నే అయితే తప్పేంటీ.. విండీస్ క్రికెటర్‌కు జో రూట్ కౌంటర్

  ప్రస్తుతం వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ 154 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్తోంది.

 • amith bhandari

  CRICKET11, Feb 2019, 6:12 PM IST

  టీంఇండియా మాజీ ప్లేయర్‌పై హాకీస్టిక్స్, సైకిల్ చైన్లతో దాడి

  భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్‌ సెలక్షన్‌ కమిటీ అధ్యక్షుడు అమిత్ భండారీపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అతడిపై దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి తల భాగంలో  తీవ్రమైన గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు. 
   

 • kl rahul

  CRICKET8, Feb 2019, 3:17 PM IST

  నా భర్త కోసం కెఎల్.రాహుల్ చేసిన సాయమే విలువైనది: మార్టిన్‌ భార్య

  కాఫీ విత్ కరణ్ షో లో మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీంఇండియా యువ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్.రాహుల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే హర్దిక్ పాండ్యా చేసిన తప్పుకు  కెఎల్. రాహుల్ బలికావాల్సి వచ్చింది. కేవలం పాండ్యాతో కలిసి ఆ షోలో పాల్గొన్నందుకే రాహుల్ పై బిసిసిఐ వేటు వేసింది. ఈ వివాదం, బిసిసిఐ నిషేదం నుండి ఇటీవలే బయటపడ్డ రాహుల్ తన ఉధారతను చాటుకున్నారు.

 • shikha chowdhary

  Telangana8, Feb 2019, 12:29 PM IST

  జయరాం హత్యలో ట్విస్ట్: శిఖా చౌదరితో హైదరాబాద్ క్రికెటర్ కు లింక్స్

  జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి విల్లాకు  యువ క్రికెటర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ ఎవరనేది తెలియడం లేదు. అతను ఐపిఎల్ మ్యాచులు కూడా ఆడినట్లు చెబుతున్నారు.