డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  944061115


స్వాతంత్య్రోద్యమం :- సహాయ నిరాకరణ, శాంతియుత సత్యాగ్రహాలు, గదర్ పార్టీ సాహసం, హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లిక్ పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్లు, సోషలిస్టు రిపబ్లిక్ ఆర్మీ, మన్యం తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్, క్విట్ ఇండియా, నావికుల తిరుగుబాటు మొదలైన పోరాటాల సంస్థల సమాహారం భారత స్వాతంత్య్రోద్యమం. సుధీర్ఘమైన కాలంతో పాటు ప్రజల అనేక పోరాట రూపాల ద్వారా ఉద్యమించడంతో 1947 ఆగస్టు 15 వ తేదీన భారతావనికి స్వాతంత్య్రోదయమయ్యిది. పరాయిపాలన అంతమయ్యింది. దేశమంతా సంకెళ్ళను తెంచుకుని స్వేచ్చా భారతం ఆవిర్భవించింది.        

                               "అభినవ భారతం నవ భారతం
                ఎన్నో పోరాటాలలు ఆత్మత్యాగాలతో 
                దాస్య శ్రుంఖలాలను తెంచుకున్న ఘన భారతం
                భారతీయుల గుండెలలో ఇది నవ వసంతం 
                ఎందరో త్యాగధనుల కలల భారతం
                మరెందరో పోరాట వీరుల పౌరుష ఫలితం 
                అమరమైన జీవితాల విలువ మన స్వాతంత్రం 
                స్వేచ్చా వాయువు పీల్చుతున్న భారత పౌరులం 
                జగములెల్ల పిక్కటిల్ల చాటుదాం మన ఘన చరిత్ర 
                అభినవ శివాజీ మోడీ సాహసేపోతమైన నిర్ణయాలతో 
                భారతమాతను విశ్వవ్యాప్తంగా గౌరవించే స్థాయిలో 
                నిలిపిన ప్రధాని మోడీ ఘనతను చాటుదాం 
                చాటుదాం భారతదేశ ఘన చరిత చాటుదాం
                భాధ్యతాయుతమైన జీవితాన్ని కొనసాగిద్దాం 
                జీవించేందుకే మనిషి ఆహారం తినాలి.
                స్వ దేశ సంక్షేమానికై  ఒక సైనికునిలా జీవించాలి."    

ఎందరో త్యాగమూర్తుల పుణ్యఫలం, వీర మరణాలతో భారతదేశానికి నిరంకుశ బ్రిటిష్ ప్రభుత్వం నుండి విముక్తి లభించింది. ఆగస్టు 15న భారతదేశపు స్వాతంత్ర్య దినోత్స‌వాన్ని ఘ‌నంగా వేడుక‌గా జ‌రుపుకుంటున్నాం.1947 ఆగస్టు 15న భారతదేశం వందల ఏళ్ళ భానిస‌త్వాన్ని నుంచి విడుద‌లైంది. దానికి గుర్తుగా స్వాతంత్రానంతరము ప్రభుత్వం ఆగస్టు 15 తేదిని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా ప్రకటించి అమలు చేస్తోంది.

చరిత్ర‌:- భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. 

బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948 లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచ యుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్యానికి దానిని ఎంచుకున్నారు బాటన్. ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణ కొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15 న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది. దేశమంతా సంకెళ్ళను తెంచుకుని స్వేచ్చా భారతం ఆవిర్భవించినా తెలంగాణా ప్రాంతానికి నిజాం పరిపాలన నుండి 1948 సెప్టెంబర్ 17 న విముక్తమైంది.   

భరతమాతను బ్రిటీష్ సామ్రాజ్యాధికారుల నుండి దాస్యవిముక్తి గావించడం కోసం ఎందరో వీరాధివీరులు, మహనీయులు తమ ప్రాణాలొడ్డి జీవితాలను అర్పించారు. అందులో చక్రవర్తులు, సాయుధ వీరులు, యువకులు... ఎందరో దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలనే త్యాగం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అలాంటి గొప్ప వీరులకు వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. భావి స్వర్ణ భారతానికి మన వంతుగా భాద్యత వహిద్దాం. అంబేద్కర్ గారు అన్నట్టుగా  దేశం అభివృద్ధి చెందడమంటే, అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు.. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి జై హింద్.