కేఎల్ రాహుల్ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్
Delhi Capitals Captain: ఎల్ఎస్జీ మాజీ కెప్టెన్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.14 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ రేసులో అతను ఉండగా, ఇప్పుడు మరో పేరు తెరమీదకు వచ్చింది.
KL Rahul , India,
Delhi Capitals Captain: ఐపీఎల్ 2025 కోసం అన్ని టీమ్ లు తమ జట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే రిటెన్షన్ లతో పాటు ఐపీఎల్ మెగా వేలం 2025 లో తమకు అవసరమైన ప్లేయర్లను కోనుగోలు చేశాయి. ఇప్పుడు రాబోయే ఐపీఎల్ 2025 మెగా లీగ్ కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ గురించి మరో హాట్ టాపిక్ వైరల్ గా మారింది.
రిషబ్ పంత్ రూపంలో ఢిల్లీకి లోటే..
ఐపీఎల్ 2025 కి ముందు ఆ జట్టు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. దీంతో అతను వేలంలో 27 కోట్ల రూపాయల రికార్డు ధర పలికి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాబోయే ఐపీఎల్ సీజన్ ఆడనున్నాడు. మొత్తంగా ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ రూపంలో ఒక నాయకుడినీ, డైనమిక్ బ్యాటర్‌ను కోల్పోయింది.
rahul pant
రిషబ్ పంత్ ఆ జట్టుకు దూరం కావడంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి. వేలంలో కెప్టెన్ ప్లేయర్ కోసం చూడవచ్చు అనే రిపోర్టుల మధ్య.. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ మాజీ కెప్టెన్, భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ను రూ.14 కోట్లకు వేలంలో దక్కించుకుంది. దీంతో అతను ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ అనే ప్రచారం సాగింది. అయితే, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రేసులో మరో భారత ఆల్ రౌండర్ ఉన్నారనే విషయాలను ఢిల్లీ టీమ్ సహ-యజమాని పార్థ్ జిందాల్ వెల్లడించారు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్-అక్షర్ పటేల్.. ఇద్దరిలో ఎవరు?
పార్థ్ జిందాల్ భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గురించి, అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్లుపై చూపిన ప్రభావం గురించి మాట్లాడారు. అక్షర్ పటేల్ జట్టులో వైస్-కెప్టెన్ నుండి కెప్టెన్‌గా ఎలా ఎదగగల ఆటగాళ్ళలో ఒకడని పేర్కొన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి రిటెన్షన్ పిక్ అయిన అక్షర్ పటేల్ ను ₹16.50 కోట్లకు రిటైన్ చేసుకోవడం.. ఇది తదుపరి సీజన్‌లలో కూడా వారు అతనిపై ఉంచిన నమ్మకాన్ని చూపుతుందని తెలిపారు.
Axar Patel
కేఎల్ రాహుల్ కు నిరాశేనా..?
"రిషబ్ అందుబాటులో లేనప్పుడల్లా, రిషబ్ గాయపడినప్పుడల్లా, అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిట్స్ లో పెద్ద పాత్ర పోషించాడు. అతను ఒక జోవియల్ ఫెలో, అతను డ్రెస్సింగ్ రూమ్‌ను చాలా తేలికగా ఉంచుతాడు. అతను సంక్లిష్టమైన పాత్రలను కూడా పోషించగలడని నేను భావిస్తున్నాను. ఒక గొప్ప పని కాబట్టి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, కానీ నేను దాని గురించి అక్సర్‌తో కూడా మాట్లాడలేదు" అని పార్థ్ జిందాల్ చెప్పాడు. అయితే, ఐపీఎల్‌లో కెప్టెన్‌గా కొన్ని సంవత్సరాలు కొనసాగిన కేఎల్ రాహుల్ అనుభవం చర్చల్లో అదనపు అంశం కావచ్చు, కాబట్టి చివరికి ఢిల్లీ టీమ్ కెప్టెన్సీని ఎవరు తీసుకుంటారనేది మరింత ఆసక్తికరంగా మారింది.