దేశంలో శ్రీ కృష్ణుడి టాప్ 10 టెంపుల్స్ ఇవే..
జీవితంలో మనం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఎలా బయటపడాలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టుగా మరెవరూ చెప్పలేదనడంలో అతిశయోక్తి లేదు. మహా భారతం, భాగవతం, భగవద్గీతల్లో ఆయన బోధనలు ఇప్పటికీ చాలా ఫేమస్. రానున్న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా భగవాన్ శ్రీ కృష్ణ దేవాలయాలను భక్తులంతా సందర్శిస్తారు. మరి దేశవ్యాప్తంగా ఉన్న టాప్ 10 శ్రీకృష్ణుడి టెంపుల్స్ వివరాలు మీ కోసం.. మీ దగ్గరలో ఉన్న దేవాలయాన్ని తప్పక దర్శించండి.
1. శ్రీకృష్ణ జన్మభూమి మందిరం, మథుర, ఉత్తరప్రదేశ్
ఈ ప్రాంతాన్ని శ్రీకృష్ణుడు జన్మించిన స్థలం అని భక్తులంతా నమ్ముతారు. ఈ ఆలయ సముదాయం శ్రీకృష్ణుడి జన్మస్థలమైన కారాగార కక్ష్యతో పాటు మరెన్నో ఇతర దేవాలయాలున్నాయి.
2. ద్వారకాధీశ్ మందిరం, ద్వారకా, గుజరాత్
చార ధామ్ యాత్రలోని ప్రధాన ఆలయాలలో ద్వారకాధీశ్ మందిరం ఒకటి. ఇది శ్రీకృష్ణుడి ప్రాచీన రాజ్యం అని భక్తుల విశ్వాసం. ఇక్కడి దేవత ద్వారకా రాజుగా పిలవబడుతున్నాడు.
3. బంకే బిహారి మందిరం, వృందావన, ఉత్తరప్రదేశ్
శ్రీకృష్ణుడి ప్రేమ రూపానికి ప్రతి బింబంగా బంకే బిహారి రూపాన్ని భక్తులు కొలుస్తారు. ఈ ఆలయం ప్రత్యేక దర్శన విధానం ఇక్కడ చాలా ఫేమస్. అంటే స్వామి విగ్రహం ముందు తెరలను తరచుగా తెరిచి మూస్తుంటారు. అలాగే మనం దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
4. జగన్నాథ మందిరం, పూరి, ఒడిషా
చార ధామ్ యాత్రలోని మరో ముఖ్యమైన ఆలయం ఇది. జగన్నాథుడి రూపంలో శ్రీకృష్ణుడు కనిపిస్తారు. ఈ ఆలయంలో నిర్వహించే రథ యాత్ర ముఖ్యమైన ఉత్సవం. దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. దీనికి లక్షలాది భక్తులు నేరుగా వచ్చి హాజరవుతారు.
5. గురువాయూర్ దేవస్థానం, గురువాయూర్, కేరళ
దక్షిణ భారతదేశంలో ముఖ్యమైన శ్రీకృష్ణ ఆలయాల్లో గురువాయూర్ ఒకటి. ఇక్కడ శ్రీకృష్ణుడు నాలుగు చేతులతో ఉన్న విష్ణు రూపంలో కనిపిస్తారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, నిత్య పూజలకు ప్రసిద్ధి.
6. ఉడిపి శ్రీకృష్ణ మఠం, ఉడిపి, కర్ణాటక
తత్వవేత్త మధ్వాచార్యులు ఉడిపి ఆలయాన్ని స్థాపించారు. కర్ణాటకలో కృష్ణుడి టెంపుల్స్‌లో ఇది చాలా ముఖ్యమైన ఆలయం. ఇక్కడ దేవతను కనకన కిండీ అనే ప్రత్యేక కిటికీ ద్వారా దర్శించుకోవాలి. ఇది చాలా ప్రత్యేకమైన దర్శనంగా పేరు పొందింది.
7. నాథ్‌ద్వారా ఆలయం, నాథ్‌ద్వారా, రాజస్తాన్
ఇక్కడ శ్రీకృష్ణుడి రూపం చాలా చిన్న వయస్సులో ఉన్నట్టు ఉంటుంది. శ్రీనాథ్‌జీగా పిలుస్తూ భక్తుల ప్రత్యేక పూజలు చేస్తారు. వైష్ణవులకు ఈ ఆలయం చాలా ముఖ్యమైనది. ఇక్కడ విశిష్ట పూజా విధానాలు ప్రత్యేకతను పొందాయి.
8. ప్రేమ మందిరం, వృందావన, ఉత్తరప్రదేశ్
ఈ ఆలయం రాధా, కృష్ణుల ప్రేమకు ప్రతీక. ఈ ఆలయం చాలా అందంగా నిర్మించారు. సాయంత్రం జరిగే లైటింగ్ షో చాలా ఫేమస్.
9. ఇస్కాన్ ఆలయం, బెంగళూరు, కర్ణాటక
ప్రపంచంలోనే అతిపెద్ద ఇస్కాన్ ఆలయాలలో ఇది ఒకటి. ఇక్కడ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలు భారీ స్థాయిలో జరుగుతాయి. పూజలు, ఉత్సవాలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
10.రాజగోపాలస్వామి దేవస్థానం, మన్నార్గుడి, తమిళనాడు
రాజగోపాలస్వామి శ్రీకృష్ణుడి మరొక రూపం. పంగుని ఉతిరం ఉత్సవం ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతుంది.