Asianet News TeluguAsianet News Telugu
1065 results for "

Ys Sharmila

"
ys sharmila became silent while elections were around the corner in ap kmsys sharmila became silent while elections were around the corner in ap kms

YS Sharmila: షర్మిల ఎందుకు మౌనందాల్చారు?

వైఎస్ షర్మిల ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆమె అస్త్రసన్యాసం ఎందుకు చేశారా? అనే ఆసక్తి నెలకొంది.
 

Andhra Pradesh Mar 27, 2024, 5:51 PM IST

Chittoor Assembly elections result 2024 kspChittoor Assembly elections result 2024 ksp

చిత్తూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

పేరుకు రాయలసీమలో భాగంగా వున్నప్పటికీ ప్రశాంతతకు చిత్తూరు నగరం మారు పేరు. 1952లో ఏర్పడిన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. హస్తం పార్టీ 8 సార్లు, టీడీపీ మూడు సార్లు, జనతా పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ , వైసీపీ, ఇండిపెండెంట్ ఒక్కోసారి చొప్పున విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చిత్తూరు, గుడిపాల మండలాలకే ఈ నియోజకవర్గం పరిమితమైంది. చిత్తూరు అంటే సీకే బాబు.. సీకే బాబు అంటే చిత్తూరు అన్నంతగా బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు చిత్తూరు నగరంలో కనిపిస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ దక్కదని తేలడంతో ఆయన జనసేనలో చేరారు. దీంతో ఎంసీ విజయేంద్ర రెడ్డిని వైసీపీ అభ్యర్ధిగా ప్రకటించారు జగన్.  టీడీపీ అభ్యర్ధిగా గురజాల జగన్ మోహన్‌ను ప్రకటించారు. 

Andhra Pradesh Mar 27, 2024, 4:46 PM IST

Gangadhara Nellore Assembly elections result 2024 kspGangadhara Nellore Assembly elections result 2024 ksp

గంగాధర నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

గంగాధర నెల్లూరుకు రాజకీయంగా ఎంతో ప్రత్యేకత వుంది. గంగాధర నెల్లూరు పేరు చెప్పగానే దివంగత నేత కుతూహలమ్మ గుర్తొస్తారు. జెడ్పీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా ఆమె పనిచేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి 2009 నుంచి నేటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగ్గా.. 2009లో కాంగ్రెస్ తరపున కుతుహలమ్మ.. 2014, 2019లలో వైపీపీ నేత నారాయణ స్వామి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గంగాధర నెల్లూరులో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దని కొందరు హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు.  దీంతో ఆయన కుమార్తె కృపాలక్ష్మీకి టికెట్ కేటాయించారు . డాక్టర్ వీఎం థామస్‌ను టీడీపీ అభ్యర్ధిగా ప్రకటించింది.

Andhra Pradesh Mar 27, 2024, 3:32 PM IST

Nagari Assembly elections result 2024 kspNagari Assembly elections result 2024 ksp

నగరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

నగరి అంటే రోజా.. రోజా అంటే నగరి అన్నంతగా చెరగని ముద్ర వేశారు. సినీనటిగా తన గ్లామర్‌కు తోడు, వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యర్ధులపై పదునైన విమర్శలు చేస్తూ దూసుకుపోతున్నారు రోజా. కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, స్వతంత్రులు ఒకసారి నగరిలో విజయం సాధించారు. పుత్తూరులో ఐదు సార్లు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన గాలి ముద్దుకృష్ణమనాయుడు నగరిలో ఆరో విజయం అందుకున్నారు. అలాగే నగరిలో కాంగ్రెస్ నేత రెడ్డివారి చెంగారెడ్డి ఐదు సార్లు గెలిచారు. నగరిలో వైసీపీ జైత్రయాత్రను కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే రోజాకు స్థానిక నేతల నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయి. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్‌ను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. 

Andhra Pradesh Mar 26, 2024, 9:48 PM IST

Srikalahasti Assembly elections result 2024 kspSrikalahasti Assembly elections result 2024 ksp

శ్రీకాళహస్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

దక్షిణకాశీగా పేరొందిన శ్రీకాళహస్తి రాజకీయంగానూ హీట్ పుట్టిస్తోంది. 2019 ముందు వరకు శ్రీకాళహస్తిలో టీడీపీ , కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడేవి. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, టీడీపీ 7 సార్లు, వైసీపీ ఒకసారి, స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ సేవలందించారు. రెడ్డి సామాజికవర్గానికి చెందినవారే ఎక్కువగా గెలుస్తూ వస్తున్నారు.  శ్రీకాళహస్తిపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. దీనిలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి టికెట్ కేటాయించారు. బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించారు చంద్రబాబు. 

Andhra Pradesh Mar 26, 2024, 7:11 PM IST

Chandragiri Assembly elections result 2024 kspChandragiri Assembly elections result 2024 ksp

చంద్రగిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

హేమాహేమీలను దేశానికి అందించిన ఘనత చంద్రగిరిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం సీఎంగా, ప్రతిపక్షనేతగా సేవలందించిన చంద్రబాబు నాయుడు స్వగ్రామం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే వుంది. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో ప్రత్యేకత చాటుకున్న గల్లా కుటుంబం కూడా చంద్రగిరి నుంచే కార్యకలాపాలు సాగించింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిని కేంద్రంగా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. 2014, 2019లలో ఆయన వరుస విజయాలు సాధించారు. చెవిరెడ్డికి బదులు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డికి జగన్ టికెట్ కేటాయించారు. చెవిరెడ్డి కుటుంబానికి చెక్ పెట్టాలని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. టీడీపీ అభ్యర్ధిగా పులివర్తి నానికి టికెట్ కేటాయించారు.

Andhra Pradesh Mar 26, 2024, 5:09 PM IST

Punganur Assembly elections result 2024 kspPunganur Assembly elections result 2024 ksp

పుంగనూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భవించిన నాటి నుంచి 1996 వరకు పుంగనూరులో ఓడిపోలేదు. తొలుత కాంగ్రెస్ ఆ తర్వాత టీడీపీలకు పుంగనూరు కంచుకోటగా నిలిచింది. పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సోదం, సోమల, చౌడేపల్లి, పుంగనూరు, పులిచర్ల, రొంపిచర్ల మండలాలున్నాయి.  పుంగనూరులో విజయం సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రి పెద్దిరెడ్డికి కూడా ప్రతిష్టాత్మకం. దీనిపై పట్టు కోల్పోకూడదని వారిద్దరూ గట్టి పట్టుదలతో వున్నారు. టీడీపీ విషయానికి వస్తే పుంగనూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు కావొస్తోంది. 2004లో చివరిసారిగా అమర్‌నాథ్ రెడ్డి విజయం సాధించారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్ధిగా చల్లా రామచంద్రారెడ్డి (బాబు)కి టికెట్ కేటాయించారు. కొత్తగా పార్టీ స్థాపించిన బోడే రామచంద్ర యాదవ్ కూడా పుంగనూరులో పోటీ చేస్తున్నారు.

Andhra Pradesh Mar 26, 2024, 3:18 PM IST

Madanapalle Assembly elections result 2024 kspMadanapalle Assembly elections result 2024 ksp

మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

దేశ విదేశాలకు మదనపల్లె నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. రాజకీయంగానూ ఈ పట్టణం కీలకమైనది. మదనపల్లె లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేం. కాంగ్రెస్ పార్టీ.. 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ, సీపీఐలు రెండేసి సార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి. రెడ్డి, కమ్మ, ముస్లిం మైనారిటీ నేతలు మదనపల్లె నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మదనపల్లెలో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాను కాదని.. నిసార్ అహ్మద్‌కు టికెట్ కేటాయించారు.  టీడీపీ టికెట్‌ను షాజహాన్ భాషాకు చంద్రబాబు ప్రకటించడంతో రాజకీయం మలుపులు తిరుగుతోంది. 

Andhra Pradesh Mar 25, 2024, 8:39 PM IST

Pileru Assembly elections result 2024 kspPileru Assembly elections result 2024 ksp

పీలేరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చల్లా ప్రభాకర్ రెడ్డి వంటి నేతలు పీలేరు నుంచే ప్రాతినిథ్యం వహించారు. దాదాపు 5 దశాబ్లాలుగా నల్లారి కుటుంబం పీలేరు నుంచే రాజకీయాలు కొనసాగిస్తోంది. నల్లారి అమర్‌నాథ్ రెడ్డి.. పీవీ నరసింహారావు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి.. ఎమ్మెల్యేగా, చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా , సీఎంగా సేవలందించారు. ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరి యాక్టీవ్‌గా వుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ.. 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ, కేఎల్‌పీలు రెండు సార్లు, సీపీఐ ఒకసారి విజయం సాధించాయి.  పీలేరులో హ్యాట్రిక్ నమోదు చేయాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలతో వున్నారు. 

Andhra Pradesh Mar 25, 2024, 7:49 PM IST

Thamballapalle Assembly elections result 2024 kspThamballapalle Assembly elections result 2024 ksp

తంబళ్లపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా తంబళ్లపల్లె అభివృద్ధి రుచిని చూడలేదు. ఆధిపత్య పోరుకు రాజకీయాలు తోడు కావడంతో ఎంతోమంది బలయ్యారు. అనిపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇక్కడ తిరుగులేని నేతగా వెలుగొందారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో కాంగ్రెస్ , టీడీపీల హవా సాగింది. ఇరు పార్టీలు చెరో ఆరు సార్లు ఇక్కడి నుంచి గెలిచాయి. ఇతరులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. ఇక్కడ టీఎన్, కలిచర్ల కుటుంబాలదే ఆధిపత్యం. ఆ తర్వాత అనిపిరెడ్డి ఫ్యామిలీ ఎంట్రీతో తంబళ్లపల్లె రాజకీయాలు మారిపోయాయి. మరోసారి ఇక్కడ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ పట్టుదలగా వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డికి మరోసారి టికెట్ కేటాయించారు. టీడీపీ విషయానికి వస్తే.. దాసరిపల్లె జయచంద్రారెడ్డికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. 

Andhra Pradesh Mar 25, 2024, 5:59 PM IST

Kadiri Assembly elections result 2024 kspKadiri Assembly elections result 2024 ksp

కదిరి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

అనంతపురం జిల్లాలో కీలక పట్టణంగా కదిరి వెలుగొందుతోంది. 1952లో ఏర్పడిన కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి ఆ పార్టీ 7 సార్లు, టీడీపీ 3 సార్లు, వైసీపీ రెండు సార్లు, బీజేపీ ఒకసారి , ఇతరులు ఒకసారి విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,39,867 మంది. కదిరిపై పట్టు కోల్పోకూడదని గట్టి పట్టుదలతో వున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. సర్వేలు, ఇతర సమాచారం ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యే శిద్దారెడ్డికి టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా మైనార్టీ నేత మక్బూల్ భాషాను అభ్యర్ధిగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి యశోదా దేవికి చంద్రబాబు టికెట్ కేటాయించారు. 

Andhra Pradesh Mar 25, 2024, 4:46 PM IST

Dharmavaram Assembly elections result 2024 kspDharmavaram Assembly elections result 2024 ksp

ధర్మవరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

రాష్ట్రంలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో ధర్మవరం ఇప్పటికీ కొనసాగుతుండటం దురదృష్టకరం. ఇక్కడి నేతన్నలు తమ కళతో ధర్మవరానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారు. నియోజకవర్గంలో అత్యధిక మంది ప్రజలు వ్యవసాయం , చేనేత రంగాలపై ఉపాధి పొందుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ఈ సెగ్మెంట్ కంచుకోట. 1983 నుంచి 2004 వరకు టీడీపీకి ధర్మవరంలో ఎదురులేకుండా పోయింది. అయితే 2009లో కేతిరెడ్డి ఎంట్రీతో తెలుగుదేశం జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఈ సెగ్మెంట్ పరిధిలో ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలున్నాయి. కమ్మ, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన నేతలే ధర్మవరంలో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు. ధర్మవరంలో మరోసారి గెలవాలని కేతిరెడ్డి ధీమాగా వున్నారు. కూటమి విషయానికి వస్తే.. తన కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

Andhra Pradesh Mar 25, 2024, 3:07 PM IST

Puttaparthi Assembly elections result 2024 kspPuttaparthi Assembly elections result 2024 ksp

పుట్టపర్తి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కొన్నేళ్ల క్రితం ఓ చిన్న గ్రామంగా వున్న పుట్టపర్తి నేడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దీనికి కారణం సత్యసాయి బాబా. సత్యసాయి నిర్యాణం తర్వాత పుట్టపర్తి వైభవం తగ్గినప్పటికీ .. భక్తుల రాక మాత్రం తగ్గలేదు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పుట్టపర్తి ఏర్పడింది. గతంలో వున్న గోరంట్ల నియోజకవర్గం రద్ధయి.. పుట్టపర్తి పుట్టుకొచ్చింది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి మూడు సార్లు ఎన్నికలు జరిగితే.. రెండు సార్లు టీడీపీయే గెలిచింది. పుట్టపర్తిలో టీడీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని జగన్ పావులు కదుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఆయన టికెట్ కేటాయించారు. వయసు రీత్యా పల్లె రఘునాథరెడ్డికి టికెట్ నిరాకరించినప్పటికీ.. ఆయన కోడలు సింధూర రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు . 

Andhra Pradesh Mar 23, 2024, 9:43 PM IST

Penukonda Assembly elections result 2024 kspPenukonda Assembly elections result 2024 ksp

పెనుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కాంగ్రెస్ పార్టీ పెనుకొండ నుంచి 6 సార్లు, టీడీపీ 7 సార్లు , స్వతంత్రులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల అనంతపురం జిల్లాను కనుసైగతో శాసించారు. పరిటాల రవి బతికున్నంత వరకు ఈ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రత్యర్ధులు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. పెనుకొండను వదులుకుని రాప్తాడు నుంచి సునీత ఈసారి పోటీ చేస్తున్నారు. తమ కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. సవితమ్మను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. వైసీపీ విషయానికి వస్తే పెనుకొండపై ఎట్టిపరిస్ధితుల్లోనూ పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో మంత్రి ఉషశ్రీ చరణ్‌ను కళ్యాణ దుర్గం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు

Andhra Pradesh Mar 23, 2024, 9:07 PM IST

Hindupur Assembly elections result 2024 kspHindupur Assembly elections result 2024 ksp

హిందూపురం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

రాష్ట్రమంతా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీచినా హిందూపురంలో మాత్రం తెలుగుదేశం విజయం ఖాయమనే సెంటిమెంట్ వుంది. కుప్పంలోనూ చంద్రబాబు ఏడుసార్లు మాత్రమే గెలవగా.. హిందూపురంలో టీడీపీ అభ్యర్ధులు 10 సార్లు విజయం సాధించారు. అభ్యర్ధితో సంబంధం లేకుండా టీడీపీని గెలిపించడం ఒక్కటే తమకు తెలుసు అన్నట్లుగా హిందూపురం ప్రజలు ముందుకు సాగుతున్నారు. నందమూరి తారకరామారావు .. ఆ తర్వాత ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఒకసారి , మరో తనయుడు బాలకృష్ణ రెండు సార్లు హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వహించారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని పట్టుదలతో వున్నారు. టీడీపీ కంచుకోటను బద్ధలుకొట్టాలని సీఎం వైఎస్ జగన్ పావులు కదుపుతున్నారు. బీసీ వర్గానికి చెందిన దీపికను అభ్యర్ధిగా ప్రకటించారు. 

Andhra Pradesh Mar 23, 2024, 7:39 PM IST