Asianet News TeluguAsianet News Telugu

పెనుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కాంగ్రెస్ పార్టీ పెనుకొండ నుంచి 6 సార్లు, టీడీపీ 7 సార్లు , స్వతంత్రులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల అనంతపురం జిల్లాను కనుసైగతో శాసించారు. పరిటాల రవి బతికున్నంత వరకు ఈ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రత్యర్ధులు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. పెనుకొండను వదులుకుని రాప్తాడు నుంచి సునీత ఈసారి పోటీ చేస్తున్నారు. తమ కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. సవితమ్మను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. వైసీపీ విషయానికి వస్తే పెనుకొండపై ఎట్టిపరిస్ధితుల్లోనూ పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో మంత్రి ఉషశ్రీ చరణ్‌ను కళ్యాణ దుర్గం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు

Penukonda Assembly elections result 2024 ksp
Author
First Published Mar 23, 2024, 9:07 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే పేరు పరిటాల రవి. పెనుకొండను కేంద్రంగా చేసుకుని పరిటాల అనంతపురం జిల్లాను కనుసైగతో శాసించారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఆయన రాష్ట్ర ప్రజలకు సుపరిచితులు. పరిటాల రవి బతికున్నంత వరకు ఈ వైపు కన్నెత్తి చూడటానికి కూడా ప్రత్యర్ధులు భయపడేవారంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా స్థానం సంపాదించిన రవికి 2004 వరకు ఎదురులేకుండా పోయింది. 2004లో వైఎస్ ప్రభంజనంలోనూ గెలిచిన పరిటాల.. 2005లో తన చిరకాల ప్రత్యర్ధి మద్దెలచెరువు సూరి కుట్రకు బలైపోయారు. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయం వద్ద ఆయనపై మొద్దుశీను కాల్పులు జరిపి హత్య చేశాడు. 

పెనుకొండ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. పరిటాల ఫ్యామిలీకి అడ్డా :

1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట వంటిది. ఈ సెగ్మెంట్ పరిధిలో పరిగి, పెనుకొండ, గోరంట్ల, సోమందేపల్లి, రోద్దం మండలాలున్నాయి. పెనుకొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,20,383 మంది. కాంగ్రెస్ పార్టీ పెనుకొండ నుంచి 6 సార్లు, టీడీపీ 7 సార్లు , స్వతంత్రులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించాయి. ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్రంగా నిలిచిన పెనుకొండ ఇప్పుడు ప్రశాంతంగా వుంటోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి ఎం శంకరనారాయణకు 96,607 ఓట్లు రాగా.. టీడీపీ అభ్యర్ధి బీకే పార్థసారథికి 81,549 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 15,058 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. 

పెనుకొండ శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. చంద్రబాబు ప్రయోగం :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. తమ కుటుంబానికి కంచుకోట వంటి పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాలు కేటాయించాలని పరిటాల సునీత చంద్రబాబును కోరారు. అయితే రెండు సెగ్మెంట్లలో ఏదో ఒకదానికే పరిమితమవ్వాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెనుకొండను వదులుకుని రాప్తాడు నుంచి సునీత ఈసారి పోటీ చేస్తున్నారు. తమ కంచుకోటలో తిరిగి పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. పరిటాల కుటుంబం తప్పుకోవడంతో సీనియర్ నేత బీకే పార్థసారథికి టికెట్ వస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా సవితమ్మను అభ్యర్ధిగా ప్రకటించారు చంద్రబాబు. వైసీపీ విషయానికి వస్తే పెనుకొండపై ఎట్టిపరిస్ధితుల్లోనూ పట్టు కోల్పోకూడదనే ఉద్దేశంతో మంత్రి ఉషశ్రీ చరణ్‌ను కళ్యాణ దుర్గం నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios