Asianet News TeluguAsianet News Telugu

రేపే ఏపీలో ఎన్నికల సమరం.. నాలుగో దశ ఎన్నికల పూర్తి వివరాలివే..

Andhra Pradesh Assembly Elections 2024: దేశంలో రేపు నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలు జరనున్నాయి. దీని కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దేశంలోని 96 లోక్ సభ స్థానాలకు, రెండు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. 

Andhra Pradesh Assembly Elections 2024 All Arrangements Set For 4th Phase Lok Sabha Elections 2024, More Details Inside KRJ
Author
First Published May 12, 2024, 8:59 PM IST

Andhra Pradesh Assembly Elections 2024: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. మరి కొన్ని గంటల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలోని 10 రాష్ట్రాలతో పాటు ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 96 లోక్ సభ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే ఈ విడతలో 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇందులో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, అలాగే ఒడిశా ఉంది. 

ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్ సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దాని కోసం అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా పూర్తి చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలూ జరగకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది ఏపీలోని అరుకు (ఎస్టీ), శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అమలాపురం (ఎస్సీ), రాజమండ్రి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల (ఎస్సీ), ఒంగోలు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, హిందూపురం, కడప, నెల్లూరు, తిరుపతి (ఎస్సీ), రాజంపేట, చిత్తూరు (ఎస్సీ) లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, భోంగీర్, నాగర్ కర్నూల్, నల్గొండ, మహబూబ్ నార్, చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్, జహీరాబాద్ స్థానాలు ఉన్నాయి. 

బీహార్​లో 5 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో సమస్తిపూర్, ఉజియార్పూర్, దర్భంగా, ముంగేర్, బెగుసరాయ్ ఉన్నాయి. అలాగే జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోక్ సభ స్థానానికి ఎన్నికల జరగనుంది. జార్ఖండ్ లో ఖుంటి, లోహర్దగా, సింగ్భూమ్, పాలము, ఒడిశాలో నబరంగ్‌పూర్, కలహండి, కోరాపుట్, బెర్హంపూర్ లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 

అలాగే మధ్యప్రదేశ్ ఇండోర్, ఖర్గోన్, ఖాండ్వా, దేవాస్, ఉజ్జయిని, రత్లాం, ధార్, మందసౌర్ లోక్ సభ స్థానాలకు, బీర్భూమ్, బోల్పూర్, అసన్సోల్, కృష్ణానగర్, బహరంపూర్, బర్ధమాన్-దుర్గాపూర్, బర్ధమాన్ ఈస్ట్, రానాఘాట్ స్థానాలకు, మహారాష్ట్ర,లోని ఔరంగాబాద్, జాల్నా, రేవర్, జల్గావ్, నందుర్బార్, బీడ్, షిర్డీ, అహ్మద్‌నగర్, షిరూర్, పూణే, మావల్, ఉత్తరప్రదేశ్ లోని బహ్రైచ్, అక్బర్‌పూర్, కాన్పూర్, సీతాపూర్, ధరుహర, ఖేరీ, షాజహాన్‌పూర్, కన్నౌజ్, ఇటావా, ఫరూఖాబాద్, ఉన్నావ్, మిస్రిఖ్ హర్దోయి స్థానాలకు ఈ నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నాలుగో దశ ఎన్నికలు పూర్తయిన తరువాత మరో మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. అయితే సమయం దాటినప్పటికీ.. లైన్ లో నిలబడిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios