YS Sharmila: షర్మిల ఎందుకు మౌనందాల్చారు?

వైఎస్ షర్మిల ఉన్నట్టుండి మౌనముద్ర దాల్చారు. ఎన్నికలు సమీపిస్తున్నా ఆమె అస్త్రసన్యాసం ఎందుకు చేశారా? అనే ఆసక్తి నెలకొంది.
 

ys sharmila became silent while elections were around the corner in ap kms

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం వైఎస్ జగన్‌ను కూడా విమర్శించారు. వైసీపీ విధానాలను తూర్పారబట్టారు. కానీ, ఉన్నట్టుండి వైఎస్ షర్మిల సడెన్‌గా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ షర్మిల మౌనం దాల్చడమేంటా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

మార్చి 15వ తేదీన వైఎస్ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా ఆయన కూతురు సునీత కడపలో ఓ సంస్మరణ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో వైఎస్ షర్మిల కూడా పాల్గొన్నారు. ఇద్దరూ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు సంధించారు. వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు.

కాంగ్రెస్‌కు మళ్లీ జోష్ తీసుకురావడానికి షర్మిల ప్రయత్నాలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వైజాగ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడారు. కానీ, ఈ సభ కూడా కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాన్ని తేలేదు. 

కొన్ని రోజుల తర్వాత ఏపీ కాంగ్రెస్ దాదాపు చల్లబడిపోయింది. షర్మిల క్యాంపెయిన్ దాదాపుగా శూన్యమైపోయింది. వైఎస్ షర్మిలను కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పెద్దగా కదలికలు కనిపించలేవు. ఆ తర్వాత సునీత లేదా ఆమె తల్లి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కూడా ఆగిపోయింది. 

ఇంతకు షర్మిల ఎందుకు పూర్తిగా మైనం దాల్చిందనే విషయంపై ఆసక్తి ఏర్పడింది. అసలు జగన్‌తోనే కాంగ్రెస్ ఏమైనా డీల్ పెట్టుకుందా? అనే అనుమానాలు ఈ నేపథ్యంలో వస్తున్నాయి. వైసీపీకి ముఖ్యమైన ఓటు బ్యాంక్ ఎస్సీలు, రెడ్లు. ఇందులో 3 నుంచి 5 శాతం ఓట్లను కాంగ్రెస్ తెంచేసినా.. అది వైసీపీకి తీరని నష్టాన్ని చేకూరుస్తుంది. ఈ నేపథ్యంలోనే పై అనుమానాలకు బలం చేకూరుతున్నది.  అయితే.. ఏపీ కాంగ్రెస్ జాబితా విడుదలయ్యాక అసలు దాని వ్యూహం ఏమిటనేది కొంత అర్థం కావొచ్చని చెబుతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios