Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్-19 మహమ్మారితో పోరాడేందుకు భారతదేశం ఏం చేస్తోంది..?

కొన్ని భయంకరమైన వారాల తరువాత చివరకు కోవిడ్-19 సెకండ్ వేవ్ పై వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటంలో భారతదేశానికి ఆశలు వికసించాయి.

what is india doing to battle the  covid-19 pandamic  knwo about this here
Author
Hyderabad, First Published May 19, 2021, 5:25 PM IST

బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈఓ అఖిలేష్ మిశ్రా ఈ వ్యాసాన్ని ఇంగ్లీష్ లో రాసారు. దాని తెలుగు అనువాదాన్ని మీకు అందిస్తున్నాము. 

ప్రతిరోజు కొత్త కేసులు గ్రాఫ్-1 అలాగే గత ఏడు రోజుల ఆవరేజ్ కొత్త కేసులు గ్రాఫ్-2లో తగ్గుదలను చూపిస్తుంది. కొత్త కేసులు వర్సెస్ రికవరీ  కేసులు గ్రాఫ్-03 కూడా ఇప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంది. రికవరీ కేసులు ఇప్పుడు కొత్త కేసులను అధిగమించాయి.
what is india doing to battle the  covid-19 pandamic  knwo about this here

what is india doing to battle the  covid-19 pandamic  knwo about this here

కరోనా మహమ్మారిని  అరికట్టడంలో భారత ప్రభుత్వం స్పందన ఏంటి  ? దీనికి ప్రతిస్పందన పదకొండులో  అంశాలలో 

1. వాక్సినేషన్ 

కరోనా వ్యాక్సిన్, ఇతర సైన్స్ అండ్ టెక్నాలజీ సమస్యలు ఏర్పడిన వెంటనే 14 ఏప్రిల్ 2020న  టాస్క్ ఫోర్స్ యూనిట్ ఏర్పడింది. కేవలం 9 నెలల్లోనే, కోవిడ్-19 వ్యాక్సిన్ రోల్-అవుట్  16 జనవరి 2021న దేశం మొత్తం  ప్రారంభమైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాక్సిన్  ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం మే-జూన్ 2021 నాటికి రెట్టింపు అవుతుంది, తరువాత జూలై-ఆగస్టు 2021నాటికి దాదాపు 6-7 రెట్లు పెరుగుతుంది. అంటే 

ఏప్రిల్ 2021లో ఉన్న 10 మిలియన్ల వ్యాక్సిన్ ఉత్పత్తి  జూలై-ఆగష్టు 2021 నాటికి  60-70 మిలియన్లకు అవుతుంది. సెప్టెంబర్ 2021 నాటికి నెలకు ఇది దాదాపు 100 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. కోవిషీల్డ్, స్పుత్నిక్ వంటి ఇతర ఆమోదించబడిన వ్యాక్సిన్లతో కలిపి జైడస్ కాడిల్లా, బయోఇ, నోవోవాక్స్ వంటి కొన్ని  వాక్సిన్లు  ఈ సంవత్సరం చివరిలోగా  2.16 బిలియన్ల డోసూలు అందుబాటులోకి రానున్నాయి. మే 1 నుండి 18 ఏళ్లు పైబడిన భారతీయులందరూ ఇప్పుడు వాక్సిన్ పొందిందుకు అర్హులు. ఇప్పటివరకు భారతదేశం అంతటా 185 మిలియన్లకు పైగా ప్రజలు వాక్సిన్ పొందారు. 
 

2. ఆక్సిజన్ లభ్యత

కరోనా సెకండ్ వేవ్ ముందు భారతదేశ రోజువారీ వైద్య ఆక్సిజన్ డిమాండ్ రోజుకు 900 మెట్రిక్ టన్నులు. అయితే కొద్ది రోజుల్లోనే ఇది రోజుకు 9,000 మెట్రిక్ టన్నుల వరకు పెరిగింది. కొన్ని రోజులు ఈ డిమాండ్ తీవ్రంగా పెరగటం చాలా బాధాకరమైనది. కానీ పరిస్థితిలకు అనుగుణంగా సమస్యను పరిష్కరించడానికి కీలకమైన చర్యలు తీసుకున్నారు.

ఇప్పుడు ఉత్పత్తి సమస్యలు తీరాయి అయినప్పటికీ రవాణా లాజిస్టిక్స్ రాష్ట్రాల డొమైన్ పరిధిలో ఉంది, అయినప్పటికీ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు వారి వనరులను సమీకరించటానికి మొబిలైజ్ చేయబడ్డాయి.  ఉదాహరణకు పెట్రోలియం  అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ క్రింద చమురు, గ్యాస్ పిఎస్‌యులు  లిక్విడ్ ఆక్సిజన్ రవాణా సమస్యలను అధికామించేందుకు ప్రత్యేకంగా పనిచేస్తోంది.
  
650ఎం‌టి సామర్థ్యంతో ప్రస్తుతం 12 ట్యాంకర్లు, 20 ఐ‌ఎస్‌ఓ కంటైనర్లు ఉన్నాయి. ఈ సంఖ్య ఈ నెల చివరిలోగా గణనీయంగా 2314 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో 26 ట్యాంకర్లు, 117 ఐ‌ఎస్‌ఓ కంటైనర్లకు పెరగనుంది. ఆక్సిజన్ ట్యాంకర్ల సామర్థ్యం మార్చిలో 12,480 మెట్రిక్ టన్నులతో వాటి సంఖ్య 1040. ఇప్పుడు ట్యాంకర్ల సామర్థ్యం 23,056 మెట్రిక్ టన్నులకు పెరిగి, వాటి సంఖ్య 1681కు పెరిగింది. 2020 మార్చిలో మెడికల్  ఆక్సిజన్ సిలిండర్ల లభ్యత  435,000 నుండి  మే 21కి 1.12 మిలియన్లకు పెరిగింది.
 
అదనంగా మరో 3 నెలల్లో లిక్విడ్ ఆక్సిజన్ విదేశాల నుండి 3,500ఎం‌టి దిగుమతి చేసుకొని పంపిణీ చేయబడుతుంది. అదనంగా 2285 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎంఓ యుఎఇ, బహ్రెయిన్, కువైట్, ఫ్రాన్స్ నుండి దిగుమతి చేయబడింది, వీటిలో ఒక భాగం ఇప్పటికే ఇండియాకి చేరాయి.

3. డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, పిపిఇ, ఎన్ -95 మాస్క్‌లు, వెంటిలేటర్లు

రెమ్‌డెసివిర్  ఉత్పత్తి 20 ఏప్రిల్ 2021న 3.7 మిలియన్ల నుండి 4  మే 2021న    10.1 మిలియన్లకు పెరిగింది. అలగే రెమ్‌డెసివిర్ ఉత్పత్తి చేసే  ప్లాంట్ల సంఖ్య 12  ఏప్రిల్ 2021న 20 నుండి 4 మే 2021కి 57కి పెరిగింది. అదనంగా వేలాది టోసిలిజుమాబ్ సేకరించి ఇంకా దేశవ్యాప్తంగా జారీ చేయబడింది.

డి‌ఆర్‌డి‌ఓ అభివృద్ధి చేసిన కొత్త యాంటీ కోవిడ్  ఔషధాన్ని డ్రగ్ రెగ్యులేటర్ అత్యవసర వినియోగం కోసం ఆమోదించింది. ఈ ఔషధం కోవిడ్ ను నయం చేయడంలో ఇంకా ఆసుపత్రిలో చేరే అవసరాన్ని తీవ్రంగా తగ్గించడంలో అద్భుతమైన నమ్మకాన్ని చూపించింది. 16.19 మిలియన్ పిపిఇ కిట్లు, 41 మిలియన్ ఎన్ -95 మాస్కూలు రాష్ట్రాల ఫ్రంట్ లైన్ కార్మికుల కోసం సరఫరా చేయబడింది. 38,103 కొత్త వెంటిలేటర్లును స్టాండర్డ్ రూట్ ద్వారా సరఫరా చేయబడ్డాయి.

4. మౌలిక సదుపాయాలను పరీక్షించడం

జనవరి 2020లో సింగిల్ లబొరేటరీతో పోల్చితే  సుమారు 2,463 టెస్టింగ్ సౌకర్యాలతో కలిపి 1.5 మిలియన్ల సామర్థ్యంతో  డైలీ టెస్టులు ఇప్పుడు పని చేస్తున్నాయి. అదనంగా  జీరో కోవిడ్ ప్రయోగశాల లేదా టెస్టింగ్ మెషిన్స్ దశ నుండి  స్వదేశీ తయారీ యంత్రాలు, ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 1 మిలియన్ కిట్లు ఎక్కువ ఉంది.

5. హాస్పిటల్స్ అండ్ కేర్ ఫెసిలిటీస్ 
కోవిడ్ హాస్పిటల్స్ బెడ్స్ 4,68,974తో సహా మొత్తం ఇప్పటికీ 1.86 మిలియన్ల  బెడ్స్ ఉన్నాయి. గత సంవత్సరం లాక్‌డౌన్ ముందు కేవలం 10,180 ఐసోలేషన్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. అదే విధంగా ఐసియు బెడ్స్  సామర్ధ్యం కూడా పెరిగింది, లాక్‌డౌన్‌కు ముందు ఉన్న కేవలం 2,168 నుండి ఇప్పుడు 92,000 కు పెరిగింది.

ఇప్పుడు ఐసోలేషన్ యూనిట్లుగా కోవిడ్ కేర్ రైల్వే కోచ్‌లుగా పనిచేస్తున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 17 ప్రదేశాలలో విస్తరించి ఉన్నాయి. 4,400 కోవిడ్‌ కేర్ కొచెస్ ద్వారా  70వేల  ఐసోలేషన్ బెడ్స్ రైల్వే అందుబాటులో ఉంచాయి.


6. సిటిజన్స్ కి సపోర్ట్ 
ఇప్పటికే 3 బిలియన్ డాలర్లు నేరుగా పంజాబ్‌ లోని గోధుమ పంట రైతుల ఖాతాకు బదిలీ అయ్యాయి. మొదటి సారి పంజాబ్ లోని రైతులు వారి బ్యాంకు ఖాతాలోకి నేరుగా ఈ డబ్బును అందుకున్నారు. 

ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద మొదటి 10 రోజుల్లో  12 రాష్ట్రాల్లో 20 మిలియన్ల లబ్ధిదారులకు 100,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయబడ్డాయి. ఈ పథకం గత ఏడాది  కరోనా ఫస్ట్ వేవ్ కి పొడిగింపు, దాదాపు 80 మిలియన్ల మంది ప్రజలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు.


7. గ్లోబల్ ఎయిడ్ డెలివరీ

ప్రపంచ సహాయంలో భాగంగా భారతదేశానికి మే 11నాటికి 8,900 ఆక్సిజన్ కన్సెంట్రేటర్స్, 5,043 ఆక్సిజన్ సిలిండర్లు, 18 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, 5,698 వెంటిలేటర్లు / బి పిఎపి,  340,000 లక్షలకు పైగా రెమ్‌డెసివిర్ వయల్స్ వచ్చాయి. వీటిని రాష్ట్రాలు, యుటిలకు అందించారు.


8. స్థానిక ప్రభుత్వాలు& రాష్ట్రాలకు ఆర్థిక సహాయం
కేంద్రం 25 రాష్ట్రాల్లో 1.5 బిలియన్ డాలర్లను పంచాయతీలకు ఆన్ టైడ్ గ్రాంట్స్ గా విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా  రాష్ట్రాలకు వడ్డీలేకుండా 2 బిలియన్ డాలర్ల వరకు 50 సంవత్సరాల రుణం క్యాపిటల్ ప్రాజెక్టులపై ఖర్చు అందించాలని నిర్ణయించింది


9. అత్యవసర వైద్యా సేవల అక్సెస్ మెరుగుపరచడానికి ఆర్థిక చర్యలు

కోవిడ్- సంబంధిత ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి, అత్యవసర ఆరోగ్యానికి అక్సెస్ సులభతరం చేయడానికి 3 సంవత్సరాల వరకు రెపో రేటుతో టర్మ్ లిక్విడిటీ ఫెసిలిటీ దాదాపు 8 బిలియన్ డాలర్ల పదవీకాలంతో ఏర్పాటు చేయబడింది.

ఎం‌ఎస్‌ఎం‌ఈ అండ్ ఇతర రంగ సంస్థలకు మొత్తం 2.5 బిలియన్ డాలర్లను కేటాయించారు. దాదాపు 15,000 డాలర్ల పరిమితితో ప్రతి రుణగ్రహీతకు అందుబాటులో ఉంటుంది. ఈ రుణాలు సాధారణ వడ్డీ రేట్లకు లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థిక కార్యకలాపాలు సాగేందుకు ప్రధానంగా సహాయపడతాయి

10. పి‌ఎం- కేర్స్ ఫండ్ పంపిణీ
ఇప్పటికే  ఉన్న ప్లాట్లకు అదనంగా  పి‌ఎం- కేర్స్ ఫండ్ ద్వారా 1,200 కంటే ఎక్కువగా  మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు మంజూరు చేయబడ్డాయి.  ఇది దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్లాంట్ ఉండేలా చేస్తుంది. అలాగే  ఈ ఫండ్ ద్వారా 150,000 లక్షల ఆక్సిజన్ కాన్సెంట్రేటర్స్ కొనుగోలు చేయబడింది.

పి‌ఎం- కేర్స్ ఫండ్  ద్వారా ‘మేడ్ ఇన్ ఇండియా’ 50వేల వెంటిలేటర్లును  సమీకరించడానికి ఉపయోగించబడింది. పి‌ఎం- కేర్స్ ఫండ్  నుండి దాదాపు 150 మిలియన్ డాలర్లు వలసల కోసం ఉపయోగించబడ్డాయి. 66 మిలియన్ డోసుల  సేకరణకు కూడా పి‌ఎం- కేర్స్ ఫండ్ ఉపయోగించబడుతుంది. వీటిని  కోవిడ్ -19 కొరకు వ్యాక్సిన్ల కోసం  ఫేజ్ -1 కింద హెల్త్‌కేర్ వర్కర్స్, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కోసం అందించారు.  

11. లీడింగ్ - రివ్యూ మీటింగ్స్ 

 ప్రభుత్వాలు టాప్ గేర్ లో పనిచేసేందుకు, అన్ని స్థాయిలలో నిర్ణయాధికారుల సమీకరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా నాయకత్వం వహిస్తున్నారు ప్రధాని ఇప్పటివరకు దేశాన్ని ఉద్దేశించి 10సార్లు ప్రసంగించాడు. అలాగే కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఇంకా సెకండ్ వేవ్ ప్రారంభం ముందు ముఖ్యమంత్రులతో పలు రౌండ్ల సమావేశాలు నిర్వహించారు.

ఆక్సిజన్‌ తయారీదారులు, ఔషధ తయారీదారులు, నైట్రోజెన్ ప్లాంట్ యజమానులు (వాటిని ఆక్సిజన్ తయారీకి మార్చడానికి), వైద్య నిపుణులు, సాయుధ ఉపశమనం కోసం వాటిని సమీకరించటానికి బలగాలు, టీకా తయారీదారులతో  మోడీ వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అయ్యారు. నిన్న అంటే మే 18న మోడీ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు- ఒక విధంగా గ్రామాల్లో ఏమి జరుగుతుందో  తెలుసుకోవడానికి  నేరుగా మాట్లాడరు.

అదేవిధంగా ప్రభుత్వ యంత్రాలు, క్యాబినెట్, కార్యదర్శులు, సాధికారిత సమూహాలు సమీకరించబడతాయి. భారతదేశం కష్టతరమైన కొన్ని సమయాల్లో బాధాకరమైన యుద్ధాన్ని చేసింది. కానీ ఫ్రంట్ లైన్ కార్మికులు, ఆరోగ్య నిపుణులు ప్రజల కోసం యుద్ధం చేస్తున్నరు. ఇది
ప్రజల సమిష్టి సంకల్పం ఇది  త్వరలో మంచి ఫలితాలను ఇస్తుంది.

- అఖిలేశ్ మిశ్రా 

[రచయిత న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ బ్లూ క్రాఫ్ట్ ఫౌండేషన్ కంపెనీకి సీఈఓ. దానికి పూర్వం సిటిజెన్ ఎంగేజ్మెంట్ ప్లాట్ ఫారం mygov కి డైరెక్టర్ (కంటెంట్) గా కూడా వ్యవహరించారు.]

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం. #ANCares #IndiaFightsCorona

Follow Us:
Download App:
  • android
  • ios