కరోనాతో క్యాన్సర్ కు చెక్.. వైద్యరంగంలో సంచలనం
COVID-19 shrink cancer tumors : కోవిడ్ -19 క్యాన్సర్ కణితులపై దాడి చేస్తుందని వైద్య పరిశోధకుల కొత్త అధ్యయనం గుర్తించింది. ఇది కరోనా వైరస్ ఆశ్చర్యకరమైన కొత్త కోణాన్నిగురించిన అనేక షాకింగ్ విషయాలను ప్రస్తావించింది.
covid 19
Covid-19 can attack cancer tumours: కోవిడ్ -19 వైరస్ క్యాన్సర్ కణాలపై దాడి చేయగలదనీ, అలాగే క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించగలదని వైద్య పరిశోధకులు కనుగొన్నారు. కరోనా వైరస్ ఆర్ఎన్ఏ కణితులను ప్రభావవంతంగా లక్ష్యంగా చేసుకుని నాశనం చేసే ఒక ప్రత్యేకమైన రోగనిరోధక కణాన్ని సృష్టించడానికి ప్రేరేపిస్తుందని ఈ కొత్త అధ్యయనం గుర్తించింది.
ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చిన విషయాలతో ఇప్పుడు క్యాన్సర్ తో బాధపడుతున్న కోట్లాది మందికి కొత్త క్యాన్సర్ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశాలు కల్పించింది.
లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్న కరోనా వైరస్.. ఇప్పుడు వైద్య రంగంలో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది. ప్రాణాలు తీసిన అదే వైరస్ ఇప్పుడు క్యాన్సర్ రోగులకు వరంలా మారనుందనే శుభవార్తను వైద్య పరిశోధకులు అందించారు.
కరోనా వైరస్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషించే అవకాశాలను కొత్త అధ్యయనం గుర్తించింది. క్యాన్సర్ కణితులను తగ్గించడంలో కోవిడ్-19 వైరల్ పరిచేస్తుందని నార్త్‌వెస్ట్రన్ మెడిసిన్ క్యానింగ్ థొరాసిక్ ఇన్స్టిట్యూట్లో పరిశోధనలో గుర్తించారు. ఇది కొత్త క్యాన్సర్ చికిత్సల అభివృద్ధికి ఊతం ఇచ్చే అవకాశాలున్నాయి.
నవంబర్‌లో జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్లో దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు ప్రచురించారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కొంతమంది వైద్యులు కోవిడ్ -19 తో పాటు క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంతమందిని పరిశీలించగా, వారి కణితులు తగ్గిపోవడాన్ని లేదా నెమ్మదిగా పెరగడాన్ని చూశారని కొందరు వైద్యులు కనుగొన్నారు.
covid 19
"ఇది నిజమో కాదో మాకు తెలియదు, ఎందుకంటే ఈ రోగులు చాలా అనారోగ్యంతో ఉన్నారు" అని నార్త్ వెస్ట్రన్ విశ్వవిద్యాలయంలో థొరాసిక్ సర్జరీ చీఫ్ డాక్టర్ అంకిత్ భరత్ చెప్పారు. అందుకే రోగనిరోధక వ్యవస్థ కోవిడ్ -19 చేత ప్రేరేపించబడినందున అది క్యాన్సర్ కణాలను కూడా చంపడం ప్రారంభించిందా? అనే విషయంలో పరిశోధన సాగిందన్నారు.
కోవిడ్-19, క్యాన్సర్ కణితి పెరుగుదల తగ్గింపు మధ్య ఊహించని లింక్ భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలకు మంచి సామర్థ్యాన్ని అందిస్తుంది. కొనసాగుతున్న పరిశోధన క్యాన్సర్ కణాలపై ఈ వైరస్ ప్రత్యేక ప్రభావంతో ప్రేరణ పొందిన వినూత్న చికిత్సలకు దారి తీస్తుంది.
coronavirus
డాక్టర్ భరత్, అతని బృందం SARS-CoV-2 ఉన్నప్పుడు, మోనోసైట్ అని పిలువబడే ఒక రకమైన రోగనిరోధక కణం భిన్నంగా ప్రవర్తిస్తుందని కనుగొన్నారు. సాధారణంగా మోనోసైట్లు రక్తప్రవాహంలో కదలడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. హానికర కణాలు లేదా బెదిరింపులను గుర్తించినప్పుడు ఇతర రోగనిరోధక కణాలను హెచ్చరిస్తాయి.
కొన్ని మోనోసైట్లు క్యాన్సర్-పోరాట కణాలను కణితులకు ఆకర్షించడంలో కూడా సహాయపడతాయి. అయినప్పటికీ, క్యాన్సర్ కణాలు కొన్నిసార్లు మోనోసైట్లను ట్రిక్ చేస్తాయనీ, వాటిని ఉపయోగించి రోగనిరోధక వ్యవస్థ దాడి నుండి కణితిని దాచిపెట్టే రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. అయితే, SARS-CoV-2 సమయంలో ఈ రక్షిత ప్రభావం మారుతుంది, రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్‌ను మరింత ప్రభావవంతంగా గుర్తించి, పోరాడేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు.
క్యాన్సర్-పోరాట రోగనిరోధక కణాల తయారీ కోసం ఈ అధ్యయనం ఉపయోగపడనుంది. కోవిడ్-19 వైరస్‌లోని ఆర్ఎన్ఏ క్యాన్సర్‌తో పోరాడగల ప్రత్యేకమైన రోగనిరోధక కణాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిసింది. ఆ కణాలు కణితుల లోపల క్యాన్సర్ కణాలపై ప్రయాణించి దాడి చేయగలవు. ఈ రోగనిరోధక కణ నిర్మాణాన్ని అనుకరించే చికిత్సను అభివృద్ధి చేయడంలో ఇది సహాయపడుతుందని కనుగొన్న విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఇది మెలనోమా, ఊపిరితిత్తులు, రొమ్ము, పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా కొన్ని సాధారణ క్యాన్సర్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుందని భారత్ చెప్పారు.
మానవ కణజాలాలు, జంతు నమూనాలను ఉపయోగించి అధ్యయనం జరిగిందన్నారు. అయితే, "మేము ప్రారంభ దశలో ఉన్నాము, అయితే క్యాన్సర్ చికిత్సను మార్చగల సామర్థ్యం కోవిడ్ కు ఉందని" డాక్టర్ భారత్ చెప్పారు.