Justice for Disha: కేసీఆర్ తప్పటడుగులపై చూపుడు వేళ్లు
అత్యంత పాశవికంగా మానవ మృగాలా దాడిలో హత్యాచారానికి గురైన దిశా కు న్యాయం జరగాల్సిందే అని, జస్టిస్ ఫర్ దిశా అని దేశమంతా నిరసనలు హోరెత్తుతున్నాయి. నిన్న పార్లమెంటు వేదికగా కూడా జస్టిస్ ఫర్ దిశా అంటూ అందరూ పార్లమెంటు సభ్యులు ముక్త కంఠంతో నినదించారు.
అత్యంత పాశవికంగా మానవ మృగాలా దాడిలో హత్యాచారానికి గురైన దిశా కు న్యాయం జరగాల్సిందే అని, జస్టిస్ ఫర్ దిశా అని దేశమంతా నిరసనలు హోరెత్తుతున్నాయి. నిన్న పార్లమెంటు వేదికగా కూడా జస్టిస్ ఫర్ దిశా అంటూ అందరూ పార్లమెంటు సభ్యులు ముక్త కంఠంతో నినదించారు.
జయ బచ్చన్ అయితే ఏకంగా వారిని కొట్టి చంపాల్సిందేనంటూ ఈ అమానవీయ ఘటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం పార్లమెంటులో మాట్లాడిన రక్షణ మంత్రి దీనిని "అమానవీయ" నేరంగా పేర్కొన్నారు, ఈ ఘటన మొత్తం దేశాన్నీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని అన్నారు.
ప్రస్తుత సంఘటన 2012లో ఢిల్లీ నిర్భయ ఘటనను మనకు గుర్తు చేస్తుంది. అక్కడ కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా నిర్భయపై దుర్మార్గులు దాష్టికానికి ఒడిగట్టారు. నిర్భయ మర్మాంగాల్లోకి ఇనుప వస్తువులను దూర్చి రాక్షసానందం పొందారు ఆ కర్కోటకులు.
అతి దుర్మార్గమైన ఆ కుట్రను జ్ఞప్తికి తెచ్చేదిగా ఈ దిశా ఉదంతం ఉంది. ఆ సంఘటన తరువాత అప్పుడు 2012లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఎలా తమ నిరసనలు తెలిపారో, రేపిస్టులపై కనికరం చూపెట్టకూడదని ఎలా కోరారో ఇప్పుడు అదే విధంగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.
హైదరాబాద్ ఉదంతం నేపథ్యంలో ఇన్ని నిరసనలు వెల్లువెత్తుతున్నాయంటే... ప్రస్తుతం ఉన్న చట్టాలు తగిన న్యాయం చేయలేకపోతున్నాయని ప్రజలు భావిస్తున్నారనేది వాస్తవం. దేశ చట్టాలు, న్యాయ వ్యవస్థలో మరిన్ని మార్పులు చేయాలని దేశ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సోమవారం పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఘటనను ఒక రాష్ట్రానికో లేదా ఒక నగరానికో ఆపాదించే పొరపాటు చేయవద్దని వెంకయ్య నాయుడు అన్నారు. ఇది ఒక సామాజిక బలహీనత అని, ఒక సామాజిక వ్యాధి ని వెంకయ్య నాయుడు తెలిపారు. మన వ్యవస్థలలో ఉన్న లోపల కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని, న్యాయ వ్యవస్థలు, పోలీసు వ్యవస్థల్లో ని లోపాలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
Also read: దిశ రేప్, హత్య కేసు: రంగంలోకి తమిళిసై, కేంద్రానికి నివేదిక
భారతదేశం జాతీయ నేర గణాంకాలు తీసుకుంటే, 2017 లో 33,000 అత్యాచారాలు జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఇది మునుపటి రెండేళ్ళ తో పోల్చుకుంటే తగ్గింది. అదే సంవత్సరంలో అమెరికాలో సుమారు 100,000 అత్యాచారాలు జరిగాయి.
భారత దేశ అధికారిక గణాంకాలు సమస్య యొక్క పరిధిని తక్కువగా అంచనా వేస్తున్నాయి. చాలా మంది బాధితులు ఇప్పటికీ పోలీసులను ఆశ్రయించాడు వెనకాడుతున్నారానేది అక్షర సత్యం. అత్యాచార బాధితులు సుదీర్ఘమైన, కేసు ఎప్పుడు తెగుతుందో కూడా అర్థమవ్వని న్యాయ ప్రక్రియను ఎదుర్కొంటారు.
ఇక ఈ ఘటన పైన తెలంగాణ హోమ్ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అయినా మహమూద్ అలీ స్పందించిన తీరు నిజంగా శోచనీయం. సదరు అమ్మాయి పోలీసులకు ఫోన్ చేసి ఉంటె బాగుండును అన్నారు, తొందర్లో సదరు మహిళకు గుర్తోచిందో రాలేదో ఆ సంకట స్థితిలో అటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టే అమ్మాయి ఇలా చనిపోయిందనడం బాధాకరం.
అంతే తప్ప సదరు అభాగ్యురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగానే స్పందించని అధికారులకు సంబంధం కూడా లేదన్నట్టు మాట్లాడడం, వ్యవస్థ తప్పు లేదు కేవలం మహిళాది మాత్రమే తప్పిదం అనడం గర్హనీయం. అయినా చిన్నప్పటి నుండి భయపడితేనో, దెబ్బ తగిలితేనే అమ్మ అని అరిచామే తప్ప పోలీస్ అని అరవడం ఈ సమాజం నేర్పలేదు కదా!
ఇక ఏకంగా పోలీసు ఉన్నతాధికారి కమీషనర్ అంజనీ కుమార్ ఏకంగా ఈ ఘటనతో తమకు సంబంధం లేదని చెబుతూ, ఈ ఘటన సైబరాబాద్ పరిధిలో జరిగిందని చేతులు దులుపుకుని ప్రయత్నం చేయడం మరీ విడ్డూరం. కేవలం హైదరాబాద్ పోలీసులు అని తప్పుగా రాసినందుకు అంజనీ కుమార్ గారికి అంత బాధ కలిగితే, అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళితే, చాలా అసభ్యంగా పోలీసు వారు మాట్లాడితే వారికి కలిగిన బాధ ఎంతలా ఉంటుందో అంజనీ కుమార్ గారు ఊహించలేకపోయారా.
ఇక మన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ ఘటన పైన తొలుత స్పందించని లేదు. ఏదో జాతీయ మీడియా గగ్గోలు పెట్టడంతో, సోషల్ మీడియాలో కేసీఆర్ మిస్సింగ్ అని జోకులు పేలడంతో, తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి ని ఒక జాతీయ మీడియా ఛానల్ యాంకర్ ముఖ్యమంత్రి ఒక ప్రకటన కూడా చేయరా అని నిలదీయడంతో ఎట్టకేలకు కేసీఆర్ స్పందించారు.
Also read: కుళ్లు సమాజం... పోర్న్ సైట్స్ లో ‘దిశ’ రేప్ వీడియో కోసం...
స్పందించిన కెసిఆర్ మహిళా కండెక్టర్లకు 8 గంటలలోపు డ్యూటీలు ముగించుకోవాలని అన్నారు. ఇది సదుద్దేశంతోనే మహిళలను సాయంత్రం వరకు కష్టబెట్టడం ఎందుకు అని అన్న కూడా, మన మధ్యనే మానవ మృగాలు తిరుగుతున్నాయి అనే కామెంట్ తరువాత ఈ మాట అనడంతో ఆడవారు రాత్రి 8గంటల తరఫువాత బయట తిరగకూడదా అనే ప్రశ్నే ఉద్భవిస్తుంది.
మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ కూడా ఇదే విషయాన్నీ లేవనెత్తారు. విశ్వనగరంగా హైదరాబాద్ ను తయారు చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడడం అందరికి రుచించడం లేదు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ వద్ద పోలీసు పహారా లేకపోవడం మరీ విడ్డూరంగా లేదూ!
అర్థరాత్రి ఆడది ఒంటరిగా తిరిగగలిగినప్పుడు భారత దేశానికి నిజమైన స్వాతంత్రం వాచినట్టు అన్న మహాత్మా గాంధీ మాటలను గనుక గుర్తు చేసుకుంటే, మనకు స్వతంత్రం రాలేదన్నట్టే అనుకోవాలేమో. పోలీసు వ్యవస్థను అత్యాధునికంగా తీర్చిదిద్దెందుకు అన్ని వనరులను సమకూర్చమని చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలోనే ఇలాంటి ఘటన జరగడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని గర్వంగా చెప్పుకునే రాష్ట్రంలో ఇలా అసభ్యంగా పోలీసులు మాట్లాడడం అత్యంత బాధాకరం.