Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ జంట పేలుళ్లు : సరైన మార్గాల ద్వారా స్పష్టంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది..

జమ్మూలో ఉపయోగించిన పరికరాలు బహుశా క్రూడ్ టెక్నాలజి  డెమొన్స్ట్రేటర్స్ కాని వారు  సైనిక, ఇతర సున్నితమైన మోహరింపులను నోటీసులో ఉంచారని లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ చెప్పారు.

Jammu twin blasts show it is time to clearly think through the right offensive options says Lt Gen Syed Ata Hasnain.
Author
Hyderabad, First Published Jun 28, 2021, 2:45 PM IST

 

 చిన్న డ్రోన్ల ద్వారా లక్ష్యాలపై పేలుడు పదార్థాలను  చేరవేసే  కొనసాగుతున్న వాటి గురించి రాయడానికి పెద్దగా పరిశోధన అవసరం లేదు. జమ్మూలోని ఇండియన్ ఎయిర్ ఫోర్స్  విమానాశ్రయం  టెక్నికల్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున డ్రోన్ ఐ‌ఈ‌డి దాడికి గురైంది, ఈ ఘటనలో స్వల్పంగా నష్టం  సంభవించింది.

గత రెండు సంవత్సరాల నుండి ఇప్పటికరకు  వివిధ క్వాడ్‌కాప్టర్లు (రోటరీ-వింగ్ డ్రోన్‌లు) సరిహద్దు రేఖను దాటి పాకిస్తాన్ నుండి అంతర్జాతీయ సరిహద్దు (ఐబి) అండ్ పి‌ఓ‌కే(పాకిస్తాన్-ఆక్రమిత కాశ్మీర్) నుండి పంజాబ్, జమ్ము కాశ్మీర్ లోకి   చొరబడి టెక్నాలజి ఉపయోగంతో హైబ్రిడ్ యుద్ధం కోసం ఉపయోగిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితం ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ లో  భారతదేశ సైనిక స్థావరాల ఫోటోలను, మ్యాప్ చేయడానికి, చొరబాట్లను సులభతరం చేయడానికి ప్రారంభమైంది. 

గత ఐదేళ్ళుగా పంజాబ్‌లోని డిఫెన్సివ్ కెనాల్ లో  ఉన్న ప్రాంతాలకు  యుద్ధ ఆయుధాలను సరఫర చేయడానికి  ఎయిర్ బోర్న్ వాహనాలను ఉపయోగించటానికి ప్రయత్నిస్తున్న టెర్రర్ గ్రూపుల వైపు దృష్టి కేంద్రీకరించింది. ప్రతి-చొరబాటు మరింత ప్రభావవంతంగా మారడంతో ఈ సరఫరా చైన్ అంతరాయం కలిగింది, అలాగే ఉగ్రవాద సామర్థ్యంలో ప్రతికూల మలుపు తిరిగింది. 

డ్రోన్ల ద్వారా లాజిస్టిక్ సరఫరాలో ఉగ్రవాదులు, వారి స్పాన్సర్ల అనుభవం నిజంగా ఈ సవాలును అధిగమించలేదు, కాని వీటిని ఉపయోగించి పేలుడు జరిగే అవకాశం ఉంది.

పేలుడు పదార్థాలను కొంత దూరం వరకు తీసుకువెళ్లగలిగే  చిన్న-సైజ్ డ్రోన్‌లు  ఉగ్రవాదుల కల.  వారు  మొదటి నుంచి  పెద్ద టెర్మినల్ ప్రభావం కోసం భారీ డ్రోన్లలో ఉపయోగించాలనుకున్నారు, కాని ప్రారంభంలో హైబ్రిడ్ వార్ సంక్లిష్టత, దిశను మార్చడంలో ఇది సరైనదిగా పరిగణించారు. 

 మెసేజ్ క్యపబిలిటి ముఖ్యమైనది, ఎందుకంటే  ఇది సాధారణ ఫోర్సెస్ ని అప్రమత్తంగా ఉంచుతుంది. చిన్న సైజు డ్రోన్‌లను తటస్థీకరించడం చాలా కష్టం ఎందుకంటే అవి గాలిలో తక్కువగా ఉండే అవకాశం ఉంది. 

డ్రోన్లను సరిహద్దు మీదుగా లేదా నియంత్రణ రేఖ నుండి తక్కువ దూరం లాంచ్ చేస్తే అవి తక్కువ  మార్గం లక్ష్యంతో  ఉండటానికి ముఖ్యంగా రాత్రి సమయంలో ఏదైనా మాన్యువల్ సముపార్జనను నిరోధిస్తుంది.

మాకు మరింత ముఖ్యమైనది మేము ప్రతిపాదించే ప్రతిఘటనలు. పాసివ్ డిఫెన్స్  చాలా మంచిది, వర్చువల్ ఎయిర్ డిఫెన్స్ లో  కాల్పులు జరపడానికి శిక్షణ పొందిన మరిన్ని ఎయిర్ సెంట్రీలు, క్విక్ రియాక్షన్ టీం(క్యూఆర్టి) ద్వారా ఆశ్రయించాల్సి ఉంటుంది. ఉపఖండంలో హైబ్రిడ్ యుద్ధాలు ఉగ్రవాద అంశాలతో పాకిస్తాన్ మోసపూరిత సహకారాన్ని గ్రహించడం,  పోరాడవలసిన అవసరం లేదు. 

రోటరీ లేదా ఫిక్స్‌డ్ వింగ్ డ్రోన్‌లకు చాలా ఎక్కువ టెక్నాలజీ అవసరం లేదు. కానీ ఇవి మనకు విసుగుగా మారడానికి, అనవసరమైన ఇబ్బందికి మూలంగా మారడానికి ముందు సరైన ప్రమాదకర మార్గాలను స్పష్టంగా ఆలోచించాలి. మా అమ్మునేషన్ డంప్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఇలాంటి కొన్ని డ్రోన్‌లు ప్రయోగించబడటానికి చాలా కాలం ముందు, నియంత్రణ రేఖ పరిధిలో లేదా దాని వెలుపల నుండి చేయబడింది.

జమ్మూలో ఉపయోగించిన పరికరాలు బహుశా క్రూడ్ టెక్నాలజి ప్రదర్శనకారులే కాని అవి అన్ని సైనిక, ఇతర సున్నితమైన మోహరింపులను నోటీసులో ఉంచాయి, అలాగే ఆవి పునరావృతం కాకుండా నిరోధించడానికి రౌండ్-ది-క్లాక్ నిఘా (మాన్యువల్ రకంలో ఎక్కువ) అవసరం. 

ఈ డివైజెస్ జి‌పి‌ఎస్ - ఎనేబుల్  ముఖ్యమై ఇంస్ట లేషన్స్ కోసం లేకేషన్  శాటిలైట్ ద్వారా సర్వే  చేస్తుంది. అలాగే లక్ష్యాన్ని అమలు చేయగల ఖచ్చితత్వాన్ని తక్కువగా అంచనా వేయలేము. 

ఉత్తర పంజాబ్, జమ్మూ కాశ్మీర్  సున్నితమైన సరిహద్దు ప్రాంతం ఐబి పరిసరాల్లో ఇటువంటి లక్ష్యాలను ఉన్నాయి.

అలాంటి డ్రోన్‌లను ఉపయోగించి ఒక్క రాత్రిలో ఉగ్రవాదులు  చొరబడటంరతో పాటు దాడి చేయవచ్చు.  ఇంకా ముందు భాగంలో వివిధ లక్ష్యాల వద్ద స్ట్రైక్ చేయడానికి, దృష్టిని మళ్ళించడానికి ఇంకా   గందరగోళాన్ని సృష్టించడానికి భౌతిక చొరబాట్లను ఉపయోగించుకొవచ్చు. 

2019 సెప్టెంబర్ 14న సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అరాంకో ఆయిల్ రిఫైనరీపై యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు దాడిని గుర్తు చేసుకోవచ్చు. రిఫైనరీ పనులను  స్తంభింపజేయడానికి వారు 11 క్షిపణులతో పాటు ఆరు బాంబులతో నిండిన డ్రోన్‌లను ఉపయోగించారు. ఇది జమ్మూ లేదా పఠాన్‌కోట్ వద్ద అయిన్ ఇంస్టాలేషన్  10-20 కి.మీ కంటే ఎక్కువ లోతులో ఉన్న వివిధ కమ్యూనికేషన్ కేంద్రాలు హాని కలిగించడం కష్టం కాదు. 

మేము చూసిన సంఘటనలో సాక్ష్యంగా మాకు కేవలం రెండు డ్రోన్‌లను మాత్రమే వాడుకలో కనిపించాయి కాని డ్రోన్ సమూహాల మొత్తం మనకు తెలియని విషయం కాదు. కానీ ఇది చివరికి అనుసరించే వ్యూహాలు కావచ్చు. ఈ సమూహాలు పెద్ద లక్ష్యాలను చేయవచ్చు కాని కాల్పులు జరిపినప్పటికీ లక్ష్యాన్ని చేరుకున్న కొన్ని పేలుడు పదార్ధం అధిక నష్టాన్ని కలిగించవచ్చు.

- అతా హస్నైన్ ర
చయిత లెఫ్టనెంట్ జనరల్ (రిటైర్డ్) అతా హస్నైన్ శ్రీనగర్ కేంద్రంగా పనిచేసిన 15 కో కమాండర్ గా పనిచేసారు. ప్రస్తుతం కాశ్మీర్ సెంట్రల్ యూనివర్సిటీ కి ఛాన్సలర్ గా కొనసాగుతున్నారు. ఈ ఆర్టికల్ తొలుత న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ప్రచురితమైనది

Follow Us:
Download App:
  • android
  • ios