ఉక్రెయిన్‌లో ఉండిపోయిన తన పెంపుడు జంతువులను రక్షించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ డాక్టర్ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం సహాయం చేయకపోవడంతో.. సాయం కోసం భారత ప్రభుత్వాన్ని కోరుతున్నట్టుగా పేర్కొన్నారు.
తెలంగాణ పూలపండగ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. టాక్ ఆద్వర్యంలో లండన్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆడపడుచులు ఆడిపాడారు.
అమెరికాలోని టెక్సాస్ వాలర్ కౌంటీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ఈ ప్రమాదంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) బోర్డు డైరెక్టర్ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్ భార్య యలమంచిలి వాణి, ఆయన ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు.
కెనడాలో జరిగిన కాల్పుల్లో భారత్ కు చెందిన సత్వీందర్ సింగ్ మరణించారు. ఈ నెల 12న జరిగిన కాల్పుల్లో సత్వీందర్ సింగ్ గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.
భారత్‌కు చెందిన ఇద్దరు యువకులు ఉత్తర ఐర్లాండ్‌లో దుర్మరణం చెందారు. సరసులో ఈతకు దిగిన సమయంలో ప్రమాదవశాత్లు వారు ప్రాణాలు కోల్పోయారు. మృతిచెందిన యువకులను కేరళకు చెందిన జోసెఫ్ సెబాస్టియన్, రూవెన్ సైమన్‌లుగా గుర్తించారు.
స్కాట్లాండ్లో గత వారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మరణించారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.
సీనియర్ సిటిజన్లను మోసం చేసి.. అక్రమంగా నగదును లాండరింగ్ చేసినందుకు గాను ఒక భారతీయ-అమెరికన్‌కు అమెరికాలో మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.
అమెరికాకు చెందిన ఓ ఎన్నారై హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొద్దిరోజుల క్రితం ఒంటరిగా నగరానికి వచ్చిన అతను.. తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు.
సికింద్రాబాద్ కాప్రాలో ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. మృతుడిని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సురేష్ గా గుర్తించారు. 45 రోజుల క్రితమే సురేష్ అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.
భారతీయ సంతతికి చెందిన ఓ ఎన్నారై అమెరికాలో రూ.300కోట్ల మోసానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని అమెరికా కోర్టు అరెస్ట్ చేసినట్లు తెలిపింది.