అపార్ట్ మెంట్లో దుర్వాసన.. తీరా చూస్తే అనుమానాస్పద స్థితిలో ఎన్ఆర్ఐ మృతి...
అమెరికాకు చెందిన ఓ ఎన్నారై హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొద్దిరోజుల క్రితం ఒంటరిగా నగరానికి వచ్చిన అతను.. తన ఇంట్లో విగతజీవిగా కనిపించాడు.
హైదరాబాద్ : అనుమానాస్పద స్థితిలో ఓ ఎన్నారై మృతి చెందిన ఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ షేక్ షఫీ కథనం ప్రకారం.. కాప్రా సర్కిల్ డివిజన్ వెంకటేశ్వర నగర్ లోని 162 ఫ్లాట్ లో ఉంటున్న ముకురాల సురేష్ (50) ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య అనంతలక్ష్మి, కూతుర్లు సంజన (16), సహానా (12) ఉన్నారు. 20 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి టెక్సాస్ లో స్థిరపడ్డాడు. అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. 45 రోజుల క్రితం ఆస్తి వ్యవహారాలు, ఇతర పనులపై నగరానికి వచ్చాడు. అతడు తిరిగి కొద్దిరోజుల్లో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.
రెండు మూడు రోజులుగా కుటుంబీకులు ఫోన్ చేస్తే ఎత్తడం లేదు. ఎప్పుడూ అలా చేయని భర్త ఎందుకు ఫోన్ ఎత్తడం లేదు అనే అనుమానంతో.. భార్య నాగోల్ లోని శివానీనగర్ లో ఉన్న తల్లి చంద్రకళకు సమాచారం అందించింది. ఆమె మంగళవారం రాత్రి అల్లుడు నివాసానికి వచ్చి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. ఇంట్లోనుంచి దుర్వాసన వస్తోంది. దీంతో, స్థానికుల సహాయంతో తలుపులు పగలగొట్టి చూడగా.. సురేష్ విగతజీవిగా పడి ఉన్నాడు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది.
వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు వారు వచ్చి చూసి.. సురేష్ మూడు రోజుల కిందట చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అతడి మృతికి కారణాల మీద దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన మృతుడి భార్య, పిల్లలు నగరానికి బయలుదేరారని కుటుంబీకులు తెలిపారు.
వీడు మహా ‘మాయ’లోడు.. ఆరేళ్లలో వెయ్యికి పైగా మహిళలకు వల.. రూ.40కోట్లు స్వాహా...
ఇదిలా ఉండగా, జూలై 1న నీల్ చంద్రన్ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. నీల్ చంద్రన్ తన కంపెనీల్లోని పెట్టుబడిదారులకు అధిక ఆదాయం వస్తుందని తప్పుడు ఆధారాలు చూపించి.. దాదాపుగా పదివేలమందిని మోసం చేశాడు అని పేర్కొంది.
నేరారోపణల ప్రకారం.. ‘తనకున్న కంపెనీలలో ఒకటి లేదా రెండు కంపెనీలను ‘ViRSE’ అనే బ్యానర్ తో నిర్వహించేవాడు. అంతే కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపించే సాంకేతిక కంపెనీలు కూడా ఉన్నాయి. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగోలు దారుల కన్సార్టియం ద్వారా కొనుగోలు చేయబడుతోంది.. అంటూ తప్పుడు సాక్ష్యాలు కూడా చూపాడు.
నిజానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడిదారులకు ఆదాయం వస్తుంది. కానీ, చంద్రన్ కంపెనీలో అలాంటి సంపన్నకొనుగోలుదారులు ఎవరూ లేరు. చంద్రుని మీద మూడు కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపే అందుకుగాను అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసినట్లు, ఈ మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు. చంద్రన్ పై మోపబడిన ఈ అభియోగాలు రుజువైతే మూడు ఫ్రాడ్ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్ కేసుకి 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష పడుతుంది.
అలాగే, అక్రమ నగదు లావాదేవాలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కో కేసుకి 10 ఏళ్ల చొప్పున శిక్ష పడుతుందని అమెరికా న్యాయస్థానం తెలిపింది. అంతేకాదు చంద్రన్ దగ్గరున్న 39 టెస్లా వాహనాలతో సహా.. 100 వేరు వేరు ఆస్తులు బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ మోసాల ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది.