45 రోజుల క్రితం అమెరికా నుంచి.. ఇంట్లోనే కుళ్లిన స్థితిలో శవమై తేలిన ఎన్ఆర్ఐ, దుర్వాసన రావడంతో వెలుగులోకి
సికింద్రాబాద్ కాప్రాలో ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. మృతుడిని అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సురేష్ గా గుర్తించారు. 45 రోజుల క్రితమే సురేష్ అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు.
సికింద్రాబాద్ కాప్రాలో ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో శవమై తేలారు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న సురేష్ అనే వ్యక్తి ఇటీవల కాప్రాకు వచ్చాడు. ఈ క్రమంలో అతను వుంటోన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో బుధవారం తలుపులు బద్ధలుకొట్టారు. ఈ క్రమంలో కుళ్లిన స్థితిలో సురేశ్ మృతదేహం బయటపడింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు వున్నట్లుగా తెలుస్తోంది. 45 రోజుల క్రితమే సురేష్ అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని అతని మరణం వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు.