పదివేల మందిని రూ.300కోట్లకు మోసం చేసిన ఎన్నారై.. అమెరికాలో అరెస్ట్..
భారతీయ సంతతికి చెందిన ఓ ఎన్నారై అమెరికాలో రూ.300కోట్ల మోసానికి పాల్పడ్డాడు. దీంతో అతడిని అమెరికా కోర్టు అరెస్ట్ చేసినట్లు తెలిపింది.
అమెరికా : నీల్ చంద్రన్ అనే భారత సంతతి అమెరికన్ దాదాపు రూ. 300 కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డాడు. ఈ మేరకు అమెరికా న్యాయస్థానం పేర్కొంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపింది. నీల్ చంద్రన్ తన కంపెనీల్లోని పెట్టుబడిదారులకు అధిక ఆదాయం వస్తుందని తప్పుడు ఆధారాలు చూపించి.. దాదాపుగా పదివేలమందిని మోసం చేశాడు అని పేర్కొంది. నేరారోపణల ప్రకారం.. ‘తనకున్న కంపెనీలలో ఒకటి లేదా రెండు కంపెనీలను ‘ViRSE’ అనే బ్యానర్ తో నిర్వహించేవాడు. అంతే కాకుండా ఎక్కువ ఆదాయం వస్తున్నట్లు చూపించే సాంకేతిక కంపెనీలు కూడా ఉన్నాయి. పైగా ఈ కంపెనీలు సంపన్న కొనుగోలు దారుల కన్సార్టియం ద్వారా కొనుగోలు చేయబడుతోంది.. అంటూ తప్పుడు సాక్ష్యాలు కూడా చూపాడు.
నిజానికి అతని కంపెనీలో సంపన్న కొనుగోలుదారులు ఉంటేనే పెట్టుబడిదారులకు ఆదాయం వస్తుంది. కానీ, చంద్రన్ కంపెనీలో అలాంటి సంపన్నకొనుగోలుదారులు ఎవరూ లేరు. చంద్రుని మీద మూడు కేసులు, అక్రమంగా పొందిన ఆస్తిలో లావాదేవీలు జరిపే అందుకుగాను అదనంగా మరో రెండు కేసులు నమోదు చేసినట్లు, ఈ మేరకు అరెస్టు చేసినట్లు తెలిపారు. చంద్రన్ పై మోపబడిన ఈ అభియోగాలు రుజువైతే మూడు ఫ్రాడ్ కేసుల్లో ఒక్కొక్క ఫ్రాడ్ కేసుకి 20 ఏళ్ల చొప్పున జైలుశిక్ష పడుతుంది. అలాగే, అక్రమ నగదు లావాదేవాలకు సంబంధించిన రెండు కేసుల్లో ఒక్కో కేసుకి 10 ఏళ్ల చొప్పున శిక్ష పడుతుందని అమెరికా న్యాయస్థానం తెలిపింది. అంతేకాదు చంద్రన్ దగ్గరున్న 39 టెస్లా వాహనాలతో సహా.. 100 వేరు వేరు ఆస్తులు బ్యాంకు ఖాతాలు, రియల్ ఎస్టేట్ మోసాల ద్వారా సంపాదించిన ఆస్తులుగా జప్తు చేయబడతాయని స్పష్టం చేసింది.