అమెరికాలో భారతీయసంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు.. ఎందుకంటే...

సీనియర్ సిటిజన్లను మోసం చేసి.. అక్రమంగా నగదును లాండరింగ్ చేసినందుకు గాను ఒక భారతీయ-అమెరికన్‌కు అమెరికాలో మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది.

Defrauding senior citizens,Indian-American sentenced three years of imprisonment in USA

అమెరికా : senior citizensను మోసం చేసి టెలిమార్కెటింగ్ పథకం ద్వారా వచ్చిన నగదును లాండరింగ్ చేసినందుకు ఒక భారతీయ-అమెరికన్‌కు USలో మూడేళ్ల జైలు శిక్ష విధించబడింది. వివరాల్లో వెడితే.. ఇల్లినాయిస్‌కు చెందిన హిరెన్‌కుమార్ పి. చౌదరి, (29) మీద నిరుడు ఫెడరల్ మనీలాండరింగ్ అభియోగాలు మోపబడ్డాయి. దీనికి సంబంధించి అతను నేరాన్ని అంగీకరించడంతో ఇల్లినాయిస్ నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ US అటార్నీ జాన్ ఆర్ లాష్ గురువారం శిక్షను ప్రకటించారు.

వృద్ధులైన బాధితుల నుంచి సొమ్మును మోసపూరితంగా వచ్చేలా చేసి.. దాన్నిటెలిమార్కెటింగ్ పథకంలో పెట్టడం ద్వారా  లాండరింగ్ చేయడంలో చౌదరి కీలక పాత్ర పోషించారని అటార్నీ చెప్పారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, టెలిమార్కెటింగ్ స్కీమ్ ద్వారా బాధితుల నుండి డబ్బును తీసుకోవడానికి గానూ చౌదరి పక్కా స్కెచ్ వేశాడు. దీనికోసం యుఎస్‌లో అనేక బ్యాంక్ అకౌంట్లను తెరిచాడు. వీటికోసం నకిలీ భారతీయ పాస్‌పోర్ట్, తప్పుడు పేరు, తప్పుడు చిరునామాను ఉపయోగించారు.

ఖైదీ కి ‘సెక్స్ స్లేవ్’ గా ప‌ని చేయాల్సి వ‌చ్చింది - సంచలన ఆరోప‌ణ‌లు చేసిన ఇజ్రాయెలీ మ‌హిళా మాజీ గార్డ్

అంతేకాదు తాము ఎంచుకున్న సీనియర్ సిటిజన్స్ కు సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌, ఇంకా ఇతర ఏజెన్సీల నుంచి కాల్స్ చేస్తున్నామని చెబుతూ ఫేక్ కాల్స్ చేసేవారు. వారి ఐడింటిటీ దొంగిలించబడిందని.. కాబట్టి బ్యాంక్ అకౌంట్లనుంచి డబ్బును భద్రత రీత్యా వేరే బ్యాంకు ఖాతాల్లోకి మార్చాలని చెప్పేవారు. అలా చౌదరి అకౌంట్లకు డబ్బును బదిలీ చేసేవారు. 

"బాధితులలో ఒకరు మసాచుసెట్స్‌కు చెందిన రిటైర్డ్ నర్సు, ఆమె తన బ్యాంక్, రిటైర్మెంట్ ఖాతాల నుండి మొత్తం 900,000 డాలర్ల కంటే ఎక్కువ మొత్తాన్ని చౌదరి లేదా ఇతరులచే నియంత్రించబడే ఖాతాలకు బదిలీ చేసింది" అని న్యాయ శాఖ తెలిపింది. “ఏప్రిల్ 19, 2018న చౌదరి ఖాతా తెరిచి, మసాచుసెట్స్ బాధితుడి నుండి 7,000 డాలర్లు బదిలీ అయిన ఒక రోజు తర్వాత, చికాగోలోని ఒక బ్యాంక్ బ్రాంచ్‌ నుంచి చౌదరి  6,500 డాలర్లని డ్రా చేసుకున్నాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చిన సొమ్ముకు చట్టపరంగా తప్పుడు సంపాదన అని తెలిసీ చౌదరి ఈ ఆర్థిక లావాదేవీలు కొనసాగించారని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios