ఇద్దరు బాలికలపై రెండు నెలలకు పైగా పదే పదే గ్యాంగ్ రేప్

First Published 9, May 2018, 9:49 PM IST
Security gaurds gang rape two minor girks over 2 months
Highlights

ద్దరు మైనర్ బాలికలపై కోల్ కతాలోని గోవిందాపూర్ ప్రాంతంలో రెండు నెలలకు పైగా పదే పదే సామూహిక అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.

కోల్ కతా: ఇద్దరు మైనర్ బాలికలపై కోల్ కతాలోని గోవిందాపూర్ ప్రాంతంలో రెండు నెలలకు పైగా పదే పదే సామూహిక అత్యాచారం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.  ఓ సెక్యూరిటీ గార్డుతో పాటు అతని మిత్రుడు తమపై పదే పదే అత్యాచారం చేశారని బాధిత బాలికలు చెప్పారు.

నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద వారిపై కేసు నమోదు చేశారు. ఇటీవలి కాలంలో బాలికలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. 

జనవరిలో జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగి, ఆమెను హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

మైనర్ బాలికలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో 11 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్షను విధించే ఆర్డినెన్స్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జారీ చేశారు.

loader