బెంజిసర్కిల్ లోని ట్రెండ్ సెట్ లో ప్రేక్షకులతో కలిసి  హీరో మహేశ్ బాబు,దర్శకుడు కొరటాల శివ. ఎంపి గల్లా జయదేవ్.భరత్ అనే నేను చిత్రాన్ని చూశారు.  ఈ సందర్భంగామాట్లాడుతూ విజయవాడలో తన చిత్రాన్ని వీక్షించడం సంతోషంగా ఉందిని హీరో మహేష్ బాబు అన్నారు.  ఒక్కడు,పోకిరి,దూకుడు, చిత్రాల విజయోత్సవ వేడుకలను విజయవాడలోనే నిర్వహించామని చెబుతూ ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతల చెబుతున్నానని అన్నారు. ‘విజయవాడ అంటే సెంటిమెంట్ ప్రతి సినిమాకు వస్తాను. వందేళ్ళు వచ్చేవరకు నేను సినిమాలు మాత్రమే చేస్తా...రాజకీయాలతో ఇతర రంగాల జోలికి పోను. ఇప్పటవరకు క్రిష్ణ ఇమేజ్ నా మీద‌పడలేదు.. నాన్నగారి లా‌ ఈ సినిమాలో చూపించిన కొరటాల కు ధ్యాంక్స్ చెప్పుకుంటున్నా,’ మహేశ్ బాబు అన్నారు.  సినిమా విజయోత్సవానికి వచ్చాను రాజకీయాల గురించి మాట్లాడనని స్పష్టంగా మహేశ్ బాబు చెప్పారు.డైరెక్టర్ కొరటాల శివ మాట్లాడుతూ తెలుగు సినిమాలకి విజయవాడలో క్రేజ్ ఉంటుందని, విజయవాడ లొ బ్లాక్ బస్టర్ అంటే ప్రపంచం మొత్తం బ్లాక్ బస్టరే నని అన్నారు.