‘పుట్టిన వాడికి మరణం తప్పదు’ ఇది జగమెరిగిన సత్యం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి.. ఎప్పుడోకప్పుడు ప్రాణాలు విడుస్తుంది.  అయితే.. చనిపోయిన తర్వాత మనిషి ఆత్మగా మారతాడనే నమ్మకం ఉంది. అంతేకాదు.. పుణ్యాలు చేసిన వారు స్వర్గానికి, పాపాలు చేసిన వారికి యమలోకానీ వెళతారు అని కూడా పెద్దలు చెబుతుంటారు. ఇక యమలోకంలో పాపాలు చేసిన వారికి వివిధ రకాల  శిక్షలు కూడా ఉంటాయనే అందరూ చెప్పుకుంటుంటారు. అసలు చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడకు చేరుతుంది.. తదితర అంశాలు మీ కోసం..

హిమాచల్ ప్రదేశ్ లోని బర్మోర్ పట్టణంలో చౌరాసి దేవాలయాల సముదాయం ఉంది. ఇక్కడ మొత్తం 84 దేవాలయాలు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇందులోని ఒక దేవాలయమే ధర్మేశ్వర్ మహాదేవ దేవాలయం. ప్రతి జీవి ప్రాణం పోయిన తర్వాత ఆత్మ మొదట ఈ దేవాలయానికి తప్పక వస్తుందని ఇక్కడి నమ్మకం. ఈ విషయం గరుడ పురాణంతో పాటు మరికొన్ని పురాణాల్లో ప్రస్తావించారు. చూడటానికి ఒక ఇల్లులాగానే ఉంటుంది. ఈ ఇంట్లోనే యమధర్మరాజు, చిత్రగుప్తుడు మనుషుల పాప పుణ్యాలు లెక్కకడతారని ఇక్కడి ప్రజల నమ్మకం.

ఈ ఇల్లు లాంటి దేవాలయంలో రెండు ఖాళీ గదులు ఉంటాయి. మొదటి గదిలో చిత్రగుప్తుడు ఉంటారని చెబతారు. ఆత్మను యమభటులు ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత సదరు జీవి చేసిన పాపపుణ్యాలను విడమరిచి చెబుతాడట. రెండో గదిలో శిక్ష ఖరారు చేస్తారు. అనంతరం యమలోకానికి ఆత్మ వెళ్తుందట. యమధర్మరాజు చావుకి గుర్తుగా చెబుతారు కాబట్టే ఇతర దేవుళ్లలాగా ఈయనకు దేశవ్యాప్తంగా గుడులు లేవు. దేశ వ్యాప్తంగా ఉన్న యమధర్మరాజు ఆయలం ఇదొక్కటే.