Asianet News TeluguAsianet News Telugu

ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సేపు రావాలంటే..

  • ప్రతిసారీ ఛార్జర్ వెంట పెట్టుకొని తిరిగే పరిస్థితులు ఉండవు. చార్జర్ ఉన్నా.. ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. మరి అప్పుడెలా? అంటే.. ఈ చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే.. ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉంటుంది.
How To Extend Battery Life On Your Android Phone

వేలకు వేలు పోసి మరీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తుంటాం. కానీ.. ఉదయం ఫోన్ కి ఫుల్ ఛార్జింగ్ పెడితే.. మధ్యాహ్నానికి బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. కొన్ని కంపెనీలు బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ ఉండేలా ఫోన్ లను విడుదల చేస్తున్నాయి. అయినప్పటికీ వాడకాన్ని బట్టి ఛార్జింగ్ అయిపోతూనే ఉటుంది. మరి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేదెలా? ప్రతిసారీ ఛార్జర్ వెంట పెట్టుకొని తిరిగే పరిస్థితులు ఉండవు. చార్జర్ ఉన్నా.. ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం ఉండకపోవచ్చు. మరి అప్పుడెలా? అంటే.. ఈ చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే.. ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉంటుంది. ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

స్క్రీన్ బ్రైట్ నెస్..

ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉండాలంటే.. స్ర్కీన్ బ్రైట్ నెస్ ని తగ్గించుకోవాలి. అప్పుడు బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉంటుంది. అంతేకాకుండా  ఫోన్ వాల్ పేపర్ డార్క్ కలర్ ని పెట్టుకోవాలి. అప్పుడు స్క్రీన్ బ్రైట్ నెస్ తక్కువగా ఉన్నా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇది ఎల్ఈడీ ఫోన్లకు మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా స్క్రీన్ లాకింగ్ టైమ్ అవుట్ ని కూడా తగ్గించుకోవాలి.

అనవసరమైన వాటిని క్లోజ్ చేయాలి..

అవసరం ఉన్నా లేకున్నా.. చాలా మంది వారి వైఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి వాటిని 24గంటలు ఆన్ లోనే ఉంచుతారు. ఇవి ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి.. వీటిని అవసరమైనప్పుడు మాత్రమే ఆన్ చేసుకొని అవసరం అయిపోయాక ఆఫ్ చేసుకోవాలి.

యాప్స్ క్లోజ్ చేయాలి..

ఫోన్ లో చాలా యాప్స్ ఉంటాయి. వాటిని అవసరాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం. ఓపెన్ చేసిన యాప్స్ ని అవసరం తీరాక క్లోజ్ చేయాలి. అంటే వెంటనే హోమ్ బటన్ నొక్కడం కాదు. ఒక్కోసారి హోమ్ పేజీకి వెళ్లినా ఆ యాప్స్ రన్ అవుతూనే ఉంటాయి. దాని వల్ల  ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. కాబట్టి వాటిని క్లోజ్ చేయాలి.

బ్యాటరీ సేవింగ్ ఫీచర్స్..

ప్రతి స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ సేవింగ్ ఫీచర్స్ ఉంటాయి. ఒక్కో ఫోన్ లో ఒక్కో పేరుతో ఉంటాయి. ఉదాహరణకు హెచ్ టీసీలో ఎక్స్ ట్రీమ్ పవర్ సేవింగ్ మోడ్, సామ్ సంగ్ లో అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, సోనీలో స్టామినా మోడ్ ఇలా రకరకాల కంపెనీ ఫోన్ లలో ఒక్కో పేరుతో ఉంటాయి. ఆ ఆప్షన్ వినియోగించుకొని బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు.

ఆటో సింకర్ననైజ్ ఆప్షన్..

జీమెయిల్, ట్విట్టర్, క్యాలెండర్ లాంటి యాప్స్ ఎప్పటికప్పుడు రీఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఎలాంటి సమాచారాన్ని మీరు మిస్ కాకుండా ఉండేందుకు ఇవి ఆటోమెటిక్ గా రీఫ్రెష్ అవుతాయి. అయితే.. వీటి వల్ల కూడా బ్యాటరీ అయిపోతుంది. కాబట్టి ఆటో సింకర్ననైజ్ ఆప్షన్ ని టర్న్ ఆఫ్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లి గూగుల్ ఎకౌంట్ సెలక్ట్ చేసి టర్న్ ఆఫ్ ఆటో సిన్క్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ ఫాలో అయితే.. బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios