బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై సజీవదహనం

First Published 24, Mar 2018, 3:00 PM IST
Class 5 Student Set On Fire After Alleged Gang Rape In Assam Dies
Highlights
  • ఐదోతరగతి బాలికపై మైనర్ల సామూహిక అత్యాచారం
  • అనంతరం బాలిక ఒంటికి నిప్పు 
  • తీవ్రగాయాలతో మృతిచెందిన బాలిక

ఐదోతరగతి చదువుతున్న బాలికపై ముగ్గురు మైనర్ బాలురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక ఒంటికి నిప్పు అంటించి సజీవ దహనం చేశారు. ఈ దారుణ సంఘటన  అస్సాంలోని నాగోవ్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నాగావ్‌లోని లాలూన్‌గావ్‌ గ్రామానికి చెందిన ఓ 12ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఆ బాలిక ఇంటికి ఆమెతో పాటే పాఠశాలలో చదువుతున్న ముగ్గురు బాలురు వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం ఆమె ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి పారిపోయారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారి వయసు కూడా 15లోపే ఉండటం గమనార్హం.

బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగువారు వెంటనే చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే 90శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న చిన్నారి చికిత్స పొందుతూ నిన్న అర్ధరాత్రి మృతిచెందింది. చనిపోడానికి ముందు జరిగిన విషయాన్ని బాలిక పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్నామని.. మూడో బాలుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై జువైనల్‌ కేసు నమోదు చేశారు.

loader