లూథియానా: పంజాబ్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పది మంది దుండగులు 21 ఏళ్ల యువతిని కారు నుంచి బయటకు లాగి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన పంజాబ్ లోని లూథియానా ఇస్సేవాల్ గ్రామంలో చోటు చేసుకుంది.

యువతి ఓ వ్యక్తి కలిసి శనివారం రాత్రి ప్రయాణిస్తున్న కారును దుండగులు అడ్డగించారు. వారు కారును మూడు బైకులపై అనుసరిస్తూ ఓ చోట అడ్డగించారు. 

కారు ఆగగానే దుండగులు రాళ్లతో, ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారులోని ఇద్దరిని బయటకు లాగారు. ఆ తర్వాత ఇద్దరిని ఓ కాలువ ఒడ్డుకు లాక్కెళ్లారు. ఆరుగురి నుంచి ఏడుగురు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.