Nashik Toll Plaza: ఒక టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లింపు విషయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Two Women Fight At Nashik Toll Plaza: ఒక టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు చెల్లింపు అంశంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు. బూతులు తిట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన నాసిక్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళలు తీవ్ర ఘర్షణకు దిగినట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. వీరిలో ఒకరు టోల్ ప్లాజా ఉద్యోగి కాగా, మరొకరు ప్రయాణీకుడిగా కనిపించారు. వైరల్ అవుతున్న వీడియతోలో తమ జుట్లను పట్టుకుని మహిళలు గొడవపడ్డారు. తిట్టుకున్నారు. వీరి మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి అక్కడున్న వారు ఆపడానికి ముందే వీరు ఇద్దరూ ఒకరి జుట్టును ఒకరు లాగుతూ.. ఒకరినొకరు చాలాసార్లు కొట్టుకోవడం కనిపించింది. "నాసిక్ సమీపంలోని పింపాల్‌గావ్ టోల్ బూత్‌లో మహిళల మధ్య భీకర పోరు చోటుచేసుకుందనీ, జుట్టుపట్టుకుని ఒకరునొకరు దాడి చేసుకున్నారనీ.. ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది’’ అని ట్విట్టర్ ఆ వీడియోను పోస్ట్ చేశారు.
పై వీడియోలో చీర కట్టుకున్న ఇద్దరు మహిళలు ఒకరినొకరు పదే పదే కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం, చెప్పుతో కొట్టుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. వారిలో ఒకరు మరాఠీలో మాటల వాగ్వాదం మధ్య వారి చీరను చింపివేస్తానని బెదిరించడం కూడా వినబడింది. చాలా సేపు అక్కడున్న వారు ఈ ఫైటింగ్ చూస్తున్నారు. వీడియో చివర్లో, అక్కడున్న వారు జోక్యం చేసుకుని మహిళలను దూరం చేయడం కనిపిస్తుంది. టోల్ రుసుముపై అనుమానంతో బుధవారం ఈ ఘటన జరిగింది.. మొదట వాగ్వాదంతో మొదలై.. చిరవకు ఇలా జుట్టుపట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లిందని అక్కడున్న వారు చెబుతున్నారు.
మరో వీడియోలో బూట్లతో కొట్టుకున్న ఇద్దరు..
ఒక బహిరంగ ప్రదేశంలో ఇద్దరు మధ్య వయస్కులు తమ నియంత్రణను కోల్పోయి దూకుడుగా ఒకరినొకరు తమ బూట్లతో కొట్టుకోవడం చూపే ఒక వీడియో కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇద్దరు వ్యక్తులు తమ బూట్లతో ఒకరినొకరు చాలా దూకుడుగా కొట్టుకోవడంతో వైరల్ వీడియో ప్రారంభమైంది. క్లిప్‌లో ఇద్దరూ హింసాత్మకమైన వాగ్వాదానికి దిగినట్లు స్పష్టమవుతోంది. దీనిలో ఒక వ్యక్తి మరొకరి చొక్కా పట్టుకుని నేలమీద పడగొట్టడానికి ప్రయత్నించాడు. కెమెరాలో చిక్కుకున్న ఫుటేజ్‌లో ఇద్దరు వ్యక్తులు వదులుకోవడానికి సిద్ధంగా లేరని.. ఒకరికొకరు కఠినమైన పోరాటం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చూపిస్తుంది. వీరు కొట్టుకుంటున్న సమయంలో అక్కడున్న ఒక వ్యక్తి వారిని ఆపడానికి ప్రయత్నించారు. చివరకు వారి పోరాటం ముగిసింది. కొట్టుకున్న ఇద్దరు మళ్లీ తమ బూట్లను ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
