తన వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో టీటీవీ దినకరన్ సరికొత్త ఎత్తుగడ వేశారు. ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పార్టీ అధ్యక్షుడు దినకరన్ స్పష్టం చేశారు.

అనర్హతకు గురైన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి తాము సుప్రీంకోర్టుకు వెళ్లబోమని స్పష్టం చేశారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు.

శశికళ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి వ్యతిరేకంగా గ్రూపు కట్టడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టుకు వెళ్లిన వారికి న్యాయస్థానం మొట్టికాయలు వేసింది. సభాపతి నిర్ణయం సరైనదేనని తీర్పు నివ్వడంతో.. వారు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నా... ఆ తర్వాత సంశయించడంతో మౌనంగా ఉండిపోయారు.
 

టీటీవీ దినకరన్ కు ఎదురుదెబ్బ: పళని స్వామి ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్

పన్నీరు సెల్వం నావెంటే...అందుకోసమే అపాయింట్ కోరారు : దినకరన్ సంచలనం

చిన్నమ్మ ఆదేశం: టీటీవీ దినకరన్ సంచలన ప్రకటన

దినకరన్ కారుపై పెట్రోల్ బాంబు దాడి...తృటిలో తప్పించుకున్న దినకరన్

ప్రజాస్వామ్య విజయం, ఎన్నికలకు రెడీ: పళనిస్వామి

పళినిస్వామికి కోర్టు షాక్: సీబీఐ విచారణకు ఆదేశం

పళనిస్వామికి ఊరట: విస్తృత ధర్మాసనానికి ఎమ్మెల్యేల అనర్హత కేసు బదిలీ

పళనిస్వామి ప్రభుత్వానికి పరీక్ష: 18 మంది ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పు నేడే